News January 20, 2025

‘డాకు మహారాజ్’ కలెక్షన్లు ఎంతంటే?

image

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజైన 8 రోజుల్లోనే రూ.156+ కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అటు నార్త్ అమెరికాలోనూ భారీగా వసూళ్లు రాబడుతుండటం విశేషం. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా నాగవంశీ నిర్మించారు.

Similar News

News January 23, 2026

‘పెద్ది’పై క్రేజీ అప్‌డేట్.. చరణ్‌తో మృణాల్ స్పెషల్ సాంగ్?

image

రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’లో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్‌తో అలరించబోతున్నట్లు సమాచారం. ఈ పాన్ ఇండియా మూవీ కోసం మేకర్స్ అడిగిన వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. AR రెహమాన్ అదిరిపోయే మాస్ బీట్ సిద్ధం చేయగా ఈ సాంగ్‌ను చాలా గ్రాండ్‌గా చిత్రీకరించబోతున్నారని టాక్. ‘సీతారామం’తో తెలుగువారి మనసు గెలుచుకున్న ఈ భామ చరణ్‌తో కలిసి స్టెప్పులేయనుందనే వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

News January 23, 2026

వరుసగా 3 రోజులు సెలవులు!

image

తెలుగు రాష్ట్రాల్లో కొందరికి వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. సాఫ్ట్‌వేర్ సహా పలు కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు శని, ఆదివారాలతో పాటు సోమవారం రిపబ్లిక్ డే రావడంతో లాంగ్ వీకెండ్ కానుంది. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూళ్లు సైతం వారానికి 5 రోజులే నడుస్తుండటం, 26న పబ్లిక్ హాలిడే కావడంతో స్టూడెంట్స్ రేపట్నుంచి 3 రోజులు సెలవులను ఎంజాయ్ చేయనున్నారు.

News January 23, 2026

APPLY NOW: SACONలో 36 పోస్టులు

image

సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ(<>SACON<<>>) 36 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల వారు ఫిబ్రవరి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, పీజీ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC,ST, PwBD, EWSలకు రూ.100. వెబ్‌సైట్: www.sacon.in