News October 20, 2025
‘డ్యూడ్’, ‘K-Ramp’ కలెక్షన్లు ఎంతంటే?

* ప్రదీప్, మమితా బైజు కాంబోలో వచ్చిన డ్యూడ్ మూవీ 3 రోజుల్లో రూ.66 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈనెల 17న విడుదలైన ఈ చిత్రం తొలిరోజు రూ.22 కోట్లు, రెండో రోజు రూ.23 కోట్లు, నిన్న రూ.21 కోట్లు రాబట్టింది.
* కిరణ్ అబ్బవరం, యుక్తి జంటగా జైన్స్ నాని తెరకెక్కించిన ‘K-Ramp’ 2 రోజుల్లో రూ.5.1 కోట్లు(నెట్) కలెక్ట్ చేసినట్లు Sacnilk ట్రేడ్ వెబ్‌సైట్ తెలిపింది.
Similar News
News October 20, 2025
కూతురిపై అత్యాచారానికి యత్నించాడని కొట్టిచంపిన తండ్రి!

తన కూతురిపై అత్యాచారానికి యత్నించిన కామాంధుడిని రాయితో కొట్టి చంపాడో తండ్రి. ఒడిశాలోని థెన్‌కనల్ జిల్లాలో జరిగిందీ ఘటన. కాలువలో స్నానం చేసేందుకు తండ్రితో కలిసి బాలిక (10) వెళ్లింది. స్నానం ముగించుకున్నాక పక్కకు వెళ్లిన సమయంలో కరుణాకర్ (27) అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ఏడుపు విన్న తండ్రి వచ్చి బండరాయితో కొట్టి చంపాడు. తర్వాత స్థానిక పర్జంగ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
News October 20, 2025
రోహిత్, విరాట్ ఫామ్‌పై స్పందించిన గవాస్కర్

ఆస్ట్రేలియాతో రెండో ODIలో రోహిత్, విరాట్ తిరిగి పుంజుకుంటారని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆశాభావం వ్యక్తంచేశారు. వారిద్దరూ భారీ స్కోర్లు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అన్నారు. ‘రోహిత్, కోహ్లీ 2 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడట్లేదు. AUSలో బౌన్సీ పిచ్‌పై అంత ఈజీ కాదు. వారు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా లయను అందుకుంటారు. టీమ్ ఇండియా 300+ రన్స్ చేస్తుంది’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
News October 20, 2025
ఇతిహాసాలు క్విజ్ – 41 సమాధానాలు

1. దశరథుడి ప్రధాన మంత్రి పేరు ‘సుమంత్రుడు’.
2. నకుల, సహదేవుల తల్లి ‘మాద్రి’.
3. విష్ణువు నివాసం ఉండే లోకం పేరు ’వైకుంఠం’.
4. పంచాంగం అంటే ‘5’ ముఖ్యమైన అంశాల సమాహారం. అవి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం.
5. అన్నవరంలో కొలువై ఉన్న దేవుడు ‘సత్యనారాయణ స్వామి’.
<<-se>>#Ithihasaluquiz<<>>