News December 15, 2024
10 రోజుల్లో పుష్ప-2 కలెక్షన్స్ ఎంతంటే?

బాక్సాఫీస్ వద్ద పుష్ప-2 మూవీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. 10 రోజుల్లో ఈ సినిమాకు రూ.1292 కోట్లు వచ్చినట్లు మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ ఏడాది విడుదలైన భారతీయ సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసర్ అంటూ పేర్కొన్నారు. అల్లు అర్జున్ అరెస్టు ఘటనతో గత రెండు రోజులుగా కలెక్షన్ల ప్రకటనకు దూరంగా ఉన్న మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు. త్వరలోనే రూ.1500 కోట్ల క్లబ్లో ఈ సినిమా చేరే అవకాశం ఉంది.
Similar News
News December 14, 2025
రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్

AP: రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్లతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించనున్నారు.
News December 14, 2025
వార్డ్రోబ్ ఇలా సర్దేయండి

చాలామంది వార్డ్రోబ్ చూస్తే ఖాళీ లేకుండా ఉంటుంది. కానీ వేసుకోవడానికి బట్టలే లేవంటుంటారు. దీనికి కారణం సరిగ్గా సర్దకపోవడమే అంటున్నారు నిపుణులు. అన్ని దుస్తుల్ని విడివిడిగా సర్దుకోవాలి. రోజూ వాడేవి ఓచోట, ఫంక్షనల్ వేర్ మరో చోట పెట్టాలి. ఫ్యామిలీలో ఎవరి అల్మారా వారికి కేటాయించి సర్దుకోవడంలో భాగం చెయ్యాలి. సరిపడినన్ని అల్మారాలు లేకపోతే వార్డ్రోబ్ బాస్కెట్లు వాడితే వార్డ్రోబ్ నీట్గా కనిపిస్తుంది.
News December 14, 2025
ఈమె ఎంతో మందికి స్ఫూర్తి

TG: ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఓ యువతి ఓటర్లలో చైతన్యం నింపారు. అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నా ఎంతోమంది ఓటేయడానికి ఆసక్తి చూపరు. కానీ, రామాయంపేట పరిధి కల్వకుంటలో అంగవైకల్యమున్నా ఆమె పోలింగ్ బూత్కు వచ్చి ఓటేశారు. తండ్రి ఆమెను భుజాలపై మోసుకుని తీసుకెళ్లి ఓటు వేయించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.


