News October 26, 2025

అష్ట ధర్మములు ఏవంటే?

image

1. యజ్ఞాలు చేయడం, 2. వేదాలు చదవడం,
3. దానాలు చేయడం, 4. తపస్సు చేయడం,
5. సత్యాన్నే పలకడం, 6. సహనం పాటించడం,
7. కష్ట సమయాల్లో నిలకడ, ధైర్యంగా ఉండటం,
8. వివేకం, ముందుచూపుతో వ్యవహరించడం.
ఈ ఎనిమిది ధర్మాలను పాటించడం వలన మనిషి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ, ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
<<-se>>#Sankhya<<>>

Similar News

News October 26, 2025

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్‌ 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో సీనియర్ కన్సల్టెంట్, సెక్రటేరియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి MBBS/BDS/BHMS/MD/MPH/MBA/ BSc నర్సింగ్, ఫిజియోథెరపి‌తో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://devnetjobsindia.org

News October 26, 2025

ముల్తానీ మట్టితో ఎన్నో లాభాలు

image

ముల్తానీ మట్టికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని చాలా రకాల సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి మొటిమలు, మచ్చలు తగ్గించడంలో దోహదపడుతుంది. ట్యాన్ నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. ఇది ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లకి మంచి ఫలితాలనిస్తుంది. ఇది చర్మంపై ఉన్న మురికిని, అదనపు నూనెను తొలగించి మెరిసే చర్మాన్నిస్తుంది.

News October 26, 2025

RTCలో ఉద్యోగాలు.. రెండు రోజులే ఛాన్స్

image

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ పోస్టులకు 18-30 ఏళ్ల వయసు ఉండాలి. SC, ST, BC, EWS కేటగిరీలకు 5 ఏళ్ల మినహాయింపు ఉంది. డ్రైవర్ పోస్టులకు పదో తరగతి పాసై ఉండాలి. హెవీ గూడ్స్ వెహికల్ లేదా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. <>సైట్<<>>: www.tgprb.in/