News November 9, 2024
సీ ప్లేన్ ప్రత్యేకతలు ఇవే?

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సీ ప్లేన్లో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తారు. విజయవాడ నుంచి శ్రీశైలం వరకు 150 కి.మీ ప్రయాణాన్ని 45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఇది 20 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలిగినా పర్యాటకులకు ప్రకృతి అందాలు చూపేందుకు 1,500 అడుగుల ఎత్తులో వెళ్తుంది. టేకాఫ్, ల్యాండింగ్ రెండూ నీటిపైనే జరుగుతాయి. ఇందులో 14 మంది ప్రయాణించవచ్చు. దీని టికెట్ ధర దాదాపు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఉండొచ్చు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


