News March 7, 2025
‘తండేల్’ ఫైనల్ కలెక్షన్లు ఎన్నంటే?

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ‘తండేల్’ సినిమా ఫైనల్ కలెక్షన్లను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.115+ కోట్లు కలెక్ట్ చేసినట్లు వెల్లడించారు. కాగా, ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ఇవాళ్టి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం చందూ మొండేటి దర్శకత్వం వహించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.
Similar News
News December 4, 2025
మెదక్: 3వ విడత మొదటి రోజు 139 నామినేషన్లు

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో 139 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-14, కౌడిపల్లి-34, కుల్చారం-8, మాసాయిపేట-15, నర్సాపూర్-16, శివంపేట-30, వెల్దుర్తి-22 చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు 344 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈరోజు దత్త జయంతి పౌర్ణమి ఉండడంతో ఎక్కువ నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.
News December 4, 2025
OTTలోకి మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్

‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. టామ్ క్రూజ్, హేలే అట్వెల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఆగస్టులో రెంటల్ పద్ధతిలో విడుదల చేయగా తాజాగా ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటే చూడొచ్చు. ఈ చిత్రం ఈ ఏడాది మేలో విడుదలైంది.
News December 4, 2025
థైరాయిడ్ ట్యూమర్స్ గురించి తెలుసా?

థైరాయిడ్ గ్రంథి పనితీరుపైనే మనిషి జీవక్రియలు ఆధారపడి ఉంటాయి. ఇంతటి ప్రధానమైన థైరాయిడ్ గ్రంథిలో కొన్నిసార్లు ట్యూమర్స్ ఏర్పడతాయి. గొంతు భాగంలో వాపు/ గడ్డ ఏర్పడినట్లు కనిపిస్తుంది. ఈ వాపు అనేది ఆహారం తీసుకునేటప్పుడు లేదా మింగేటప్పుడు పైకీ కిందకీ కదులుతుంది. కానీ ఎటువంటి నొప్పి, ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. కణితి పరిమాణం పెరిగినప్పుడు ఆహారం తీసుకుంటుంటే పట్టేసినట్లుగా అనిపిస్తుంది.


