News April 19, 2025
‘అర్జున్ S/O వైజయంతి’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా నిన్న థియేటర్లలో రిలీజవగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5.15 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ఎమోషనల్ బ్లాక్ బస్టర్’ అంటూ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు. వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.
Similar News
News April 19, 2025
ప్రభుత్వ భూమిని ‘వసంత హోమ్స్’ ఆక్రమించింది: హైడ్రా

హైదరాబాద్ హఫీజ్‌పేట్ సర్వే నంబర్ 79లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా వివరణ ఇచ్చింది. ‘39.2 ఎకరాల్లో సగానికిపైగా ఆక్రమణలు జరిగాయి. అది ప్రభుత్వ నిషేధిత భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. సర్వే నం.79/1 పేరుతో ప్రభుత్వాన్ని ‘వసంత హోమ్స్’ తప్పుదోవ పట్టించింది. 19 ఎకరాలు ఆక్రమించి ఇళ్లు కట్టి అమ్మేశారు. ఖాళీగా ఉన్న మరో 20 ఎకరాల్లోనూ నిర్మాణాలు చేపట్టారు’ అని వివరించింది.
News April 19, 2025
KKR అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్

భారత జట్టు మాజీ సహాయక కోచ్ అభిషేక్ నాయర్ తిరిగి కేకేఆర్ జట్టుతో చేరారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘వెల్కమ్ బ్యాక్ హోమ్’ అంటూ KKR ట్వీట్ చేసింది. గతంలో అభిషేక్ KKR కోచింగ్ సిబ్బందిలో పనిచేసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో నాయర్‌పై BCCI వేటు వేసినట్లుగా తెలుస్తోంది.
News April 19, 2025
ముగిసిన ఎంపీ మిథున్ రెడ్డి విచారణ

AP: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణ ముగిసింది. అధికారులు 8 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. అనంతరం వాంగ్మూలంపై ఎంపీ సంతకం తీసుకున్నారు. మరోసారి మిథున్ రెడ్డికి నోటీసులిచ్చి విచారణకు పిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని అధికారులు విచారించారు.