News January 13, 2025
‘డాకు మహారాజ్’ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా తొలి రోజు రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. బాలకృష్ణకు ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని పేర్కొంది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నిన్న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. తమిళ, హిందీ భాషల్లో ఈనెల 17న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News December 20, 2025
ముందస్తు అనుమతి ఉంటేనే న్యూఇయర్ వేడుకలు: పోలీసులు

TG: న్యూఇయర్ వేడుకలకు ముందస్తు అనుమతులు తప్పనిసరని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే చెప్పారు. ఈవెంట్కు ఎంత మంది వస్తున్నారు? ఎన్ని టికెట్లు అమ్ముతున్నారో ముందే సమాచారమివ్వాలని ఇప్పటికే నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిపారు. అటు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదేనని చెప్పారు.
News December 20, 2025
బడ్జెట్పై ఊహాజనిత అంచనాలు వద్దు: GOVT

TG: FY26-27 బడ్జెట్కు ఊహాజనిత అంచనాలు పంపొద్దని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. ‘ఖర్చు హేతుబద్ధంగా ఉండాలి. ఎక్కువ/తక్కువలు లేకుండా వాస్తవ రిక్వైర్మెంట్ మాత్రమే పంపాలి. అవసరం మేరకే మెయింటెనెన్స్, రెంట్, వాహనాలకు ఖర్చు చేయాలి’ అని ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ స్టాఫ్ విషయంలో రేట్ కాంట్రాక్ట్, కాలం, ఎంతమంది అవసరం, ఖర్చు అంశాలు HRM నిబంధనల ప్రకారమే ఉండాలని సూచించింది.
News December 20, 2025
₹3Cr కోసం తండ్రిని పాముకాటుతో చంపించి..

పున్నామ నరకం నుంచి తప్పించేవాడు కొడుకనేది ఒకప్పటి మాట. మానవత్వం మరిచి ఆస్తుల కోసం తండ్రిని చంపేసే కొడుకులున్న కలికాలం ఇది. ఇలాంటి ఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో జరిగింది. తండ్రి గణేశన్(56) పేరుపై ₹3Cr బీమా చేయించి పాము కాటుతో చంపారు దుర్మార్గపు కొడుకులు. OCTలో ఈ ఘటన జరగగా బీమా సంస్థ అనుమానంతో అసలు విషయం బయటికొచ్చింది. ప్రస్తుతం వీరు నోట్లకు బదులు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు.


