News October 22, 2025

రష్మిక ‘థామా’ తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?

image

రష్మిక-ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్స్‌లో ఆదిత్య సర్పోదర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘థామా’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వ్యాంపైర్ థీమ్ కావడంతో ఆడియన్స్‌లో మూవీపై అంచనాలు పెరిగాయి. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్‌పై ఆసక్తి నెలకొంది. ఈ మూవీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.25.11 కోట్లు కలెక్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది ధమాకా విజయమని నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ పేర్కొంది.

Similar News

News October 22, 2025

సర్ఫరాజ్ ఇంకా ఏం నిరూపించుకోవాలి: అశ్విన్

image

సర్ఫరాజ్ ఖాన్‌ను ఇండియా-ఏ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై మాజీ ప్లేయర్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అతడు ఇంకా ఏం నిరూపించుకోవాలి? బరువు తగ్గాడు. భారీగా పరుగులు చేశాడు. గతేడాది న్యూజిలాండ్‌తో టెస్టులో సెంచరీ కూడా బాదాడు. కానీ అప్పటి నుంచి సీనియర్ టీమ్‌లో కాదు కదా A జట్టులో కూడా చోటు దక్కకపోతే ఎలా? ఇక అతడి అవసరం లేదేమో.. సర్ఫరాజ్‌కు డోర్లు దాదాపు మూసుకుపోయినట్లే’ అని వ్యాఖ్యానించారు.

News October 22, 2025

AP న్యూస్ రౌండప్

image

✒ పలు జిల్లాలకు ఆకస్మిక వరదలొచ్చే ఆస్కారం.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని Dy.CM పవన్ ఆదేశాలు
✒ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.. ఈ నెల 23న తమ పార్టీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో సంతకాలు సేకరణ: YCP
✒ ప్రభుత్వ కార్యక్రమాలపై 75.1% ప్రజలు సంతృప్తి: మంత్రి పార్థసారథి
✒ అబద్ధానికి అధికారం ఇస్తే.. అది కూటమి ప్రభుత్వం: చెల్లుబోయిన వేణు

News October 22, 2025

ఐఫోన్‌కు బదులు ఐక్యూ మొబైల్.. అమెజాన్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్

image

AP: అమెజాన్‌పై కర్నూలు జిల్లా కన్జూమర్ ఫోరం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వీరేశ్ ఇటీవల అమెజాన్‌లో రూ.80వేలతో ఐఫోన్ 15+ ఆర్డర్ చేయగా దానికి బదులు ఐక్యూ ఫోన్ వచ్చింది. కస్టమర్ కేర్‌ను సంప్రదించినా స్పందించకపోవడంతో కన్జూమర్ ఫోరాన్ని సంప్రదించాడు. బాధితుడికి ఐఫోన్‌ డెలివరీ చేయని పక్షంలో రూ.80వేల రీఫండ్‌తో పాటు మరో రూ.25వేలు చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణను NOV 21కి వాయిదా వేసింది.