News March 30, 2024
‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు సితార ఎంటర్‌టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. స్టార్ బాయ్ సిద్ధూ రికార్డులు బద్దలు కొడుతున్నాడని పేర్కొంది. కాగా ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా ఈ మూవీ వచ్చింది.
Similar News
News April 11, 2026
2028 నుంచి పెట్రోల్ బైకుల రిజిస్ట్రేషన్ నో

కాలుష్య నివారణే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026-30ని డ్రాఫ్ట్ చేసింది. 30 రోజుల పాటు నిపుణులు, ప్రజల నుంచి సలహాలు తీసుకొని దాన్ని ఖరారు చేయనుంది. 2028 ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్‌తో నడిచే టూవీలర్లను ఢిల్లీలో రిజిస్టర్ చేయరు. కేవలం ఈవీలు మాత్రమే చేస్తారు. అలాగే ఈవీలు కొనేవారికి భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించింది. 100% రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయించారు.
News April 11, 2026
గ్రాఫిక్స్‌లో ‘రామాయణ’ తగ్గేదేలే!

రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ సినిమా బాలీవుడ్‌లో కొత్త విజువల్ వండర్‌గా నిలవనుంది. హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ తరహాలో అత్యాధునిక VFX, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఈ చిత్రం కోసం ఉపయోగిస్తున్నారు. ఆస్కార్ గెలిచిన DNEG సంస్థ గ్రాఫిక్స్ బాధ్యతలు చూస్తోంది. దాదాపు ₹4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
News April 11, 2026
తిరుమల క్షేత్రపాలకుడు ఎవరో కాదు…!

7 కొండలపై కోట్లాది భక్తులకు అభయమిస్తున్న శ్రీవారి ఆలయానికి క్షేత్రపాలకుడు త్రిమూర్తుల్లో ఒకరైన శివుడి మరో రూపమైన రుద్రుడు. ఈ క్షేత్రపాలక శిల తిరుమల గోగర్భం వద్ద, పాపవినాశనం వెళ్లే మార్గంలో ఉంది. శివకేశవులకు భేదం లేదని ఇది నిరూపిస్తోంది. ప్రతి మహా శివరాత్రి రోజున TTD వారు ఇక్కడ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. తిరుమలలో విష్ణువుతో పాటు రుద్రుడికి కూడా ప్రాధాన్యత ఉందనడానికి ఇదే నిదర్శనం


