News August 15, 2025
తొలిరోజు వార్-2 కలెక్షన్స్ ఎంతంటే?

NTR, హృతిక్ కాంబోలో నిన్న రిలీజైన ‘వార్-2’ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. నార్త్‌లో తొలిరోజు కలెక్షన్లు ఊహించిన స్థాయిలో లేనట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీ వెర్షన్స్ కలిపి ఇండియాలో సుమారు ₹60 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు సినీ ట్రేడ్ అనలిస్ట్ Sacnilk తెలిపింది. హిందీ కంటే తెలుగులో కాస్త ఎక్కువ కలెక్షన్లు వచ్చాయంది. సెలవు, వీకెండ్ నేపథ్యంలో కలెక్షన్స్ స్టడీగా కొనసాగే అవకాశముంది.
Similar News
News August 15, 2025
‘సుదర్శన చక్ర మిషన్’ ప్రకటించిన ప్రధాని

ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారత రక్షణ వ్యవస్థకు సంబంధించి ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. త్రివిధ దళాల ఆయుధ సంపత్తి పెంచడమే లక్ష్యంగా ‘సుదర్శన చక్ర మిషన్’ను ప్రకటించారు. దీని ద్వారా రానున్న పదేళ్లలో రక్షణ శాఖకు అత్యంత అధునాతన ఆయుధాలు అందిస్తామని చెప్పారు. తద్వారా ఆయన పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు పంపారు.
News August 15, 2025
సెలవులు రద్దు.. రేపటి వరకు జాగ్రత్త

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరో 24 గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ‘3 రోజులు కొన్ని జిల్లాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. రెడ్ అలర్ట్ జోన్‌లో ఉన్న మెదక్, సంగారెడ్డి, వికారాబాద్‌లో మరింత అప్రమత్తంగా ఉండాలి. అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేయాలి’ అని మంత్రి ఆదేశించారు.
News August 15, 2025
‘PM వికసిత్ భారత్’ పథకాన్ని ప్రకటించిన మోదీ

ప్రధాని మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఎర్రకోటపై ఫ్రీడమ్ స్పీచ్ సందర్భంగా ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా యువత కోసం రూ.లక్ష కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. తొలిసారి ఉద్యోగం సాధించినవారికి రూ.15వేల చొప్పున ప్రోత్సాహం అందించనున్నట్లు వెల్లడించారు. ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు కూడా కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.