News December 12, 2024
‘పుష్ప-2’ తొలి వారం కలెక్షన్స్ ఎంతంటే?

‘పుష్ప-2’ సినిమా ఫస్ట్ వీక్‌లో రూ.1067కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. తొలి వారంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించినట్లు పేర్కొంది. నిన్న రూ.65 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో రూ.31.50 కోట్లు హిందీ నుంచి వచ్చినవే ఉన్నాయి.
Similar News
News December 15, 2025
అంచనాలను అందుకోని రబీ సాగు

AP: గత కొన్ని నెలలుగా వర్షాభావం, అధిక వర్షాల ప్రభావం ప్రస్తుత రబీ సీజన్‌పై ప్రభావం చూపింది. 2 నెలలు గడుస్తున్నా రబీ సాగు అంచనాలను అందుకోలేదు. ఈ సీజన్‌లో 20.70 లక్షల హెక్టార్లలో 22 రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా, 6.57 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటల సాగు జరుగుతోంది. వరి 1.33 లక్షలు, చిరుధాన్యాలు 1.21 లక్షలు, నూనెగింజలు 0.21 లక్షలు, అపరాలు 3.44 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగవుతున్నాయి.
News December 15, 2025
లెజెండరీ సింగర్ బయోపిక్‌లో సాయిపల్లవి

లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. టైటిల్ రోల్‌లో హీరోయిన్ సాయిపల్లవిని తీసుకునే యోచనలో ఉన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి. గీతా ఆర్ట్స్ నిర్మాణ సారథ్యంలో గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News December 15, 2025
ఎయిమ్స్ కల్యాణిలో 172 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

పశ్చిమ బెంగాల్‌లోని <


