News November 10, 2024

CJI చంద్రచూడ్ చెప్పిన ఆ ప్రైవేటు ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఏంటి?

image

రాజకీయ నాయకులే కాదు ప్రైవేటు ఇంట్రెస్ట్ గ్రూప్స్ నుంచీ జడ్జిలపై ఒత్తిడి ఉంటుందని CJI చంద్రచూడ్ రిటైర్మెంట్ స్పీచ్‌లో చెప్పారు. మీడియా, సోషల్ మీడియాతో జడ్జిపై ప్రెజర్ పెట్టి కేసును ఒక దిశగా నడిపించేందుకు ప్రయత్నిస్తారన్నారు. అయితే ఆ ప్రైవేటు ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఏవన్న దానిపై నెట్టింట చర్చ జరుగుతోంది. లెఫ్ట్, రైట్ వింగ్స్, ఫారిన్ లాబీయింగ్, సొరోస్ స్పాన్సర్డ్ NGOs అని కొందరి వాదన. మరి మీరేమంటారు?

Similar News

News November 13, 2024

ధోనీకి ఝార్ఖండ్ హైకోర్టు నోటీసులు

image

భారత మాజీ క్రికెటర్ ధోనీకి ఝార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, సౌమ్య దాస్ తనను రూ.15కోట్ల మేర మోసం చేశారని JAN 5న రాంచీలో ధోనీ కంప్లైంట్ చేశారు. అయితే స్థానిక జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తమపై ఆదేశించిన విచారణను సవాలు చేస్తూ దివాకర్, దాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కోర్టు తన స్టాండ్ ఏంటో చెప్పాలని ధోనీకి నోటీసులు ఇచ్చింది.

News November 13, 2024

నేడు సభలో కీలక బిల్లులు

image

AP: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ఈరోజు సభలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగిస్తూ చట్టాల్లో సవరణకు ఒక బిల్లుతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు సవరణ బిల్లు స్పీకర్ ముందుకు తీసుకురానున్నారు. కాగా ఈ సమావేశాలు నవంబర్ 22 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే.

News November 13, 2024

నేడు ఝార్ఖండ్‌లో తొలి దశ పోలింగ్

image

ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తొలిదశలో 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆయా స్థానాల్లో కలిపి మొత్తం 683 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా అందులో కేవలం 73 మంది మాత్రమే మహిళలున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,37,00,000 మంది ఓటర్ల కోసం 15,344 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.