News April 25, 2024

స్ట్రాంగ్ రూమ్ భద్రతా ప్రమాణాలేంటి? 1/2

image

ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు, వీవీప్యాట్‌లను స్ట్రాంగ్ రూమ్‌లలో EC భద్రపరుస్తుంది. అయితే స్ట్రాంగ్ రూమ్‌‌ ఏర్పాటులో కొన్ని భద్రతా ప్రమాణాలు తప్పక పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే..
➣స్ట్రాంగ్ రూమ్‌కు ఒకటే తలుపు ఉండాలి
➣ప్రవేశ ద్వారం మినహా వేరే మార్గంలో లోనికి వెళ్లేందుకు ఆస్కారం ఉండకూడదు.
➣అగ్ని ప్రమాదం సంభవించినా గోడలకు ఎలాంటి నష్టం జరగకుండా ఏర్పాట్లు ఉంటాయి.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News April 6, 2026

ALERT: వాషింగ్ మెషీన్ ఆన్‌ చేసి స్నానం చేస్తున్నారా?

image

వాషింగ్ మెషీన్ ఆన్‌‌లో ఉన్నప్పుడు స్నానం చేయొద్దని ఎలక్ట్రీషియన్లు సూచిస్తున్నారు. ‘మెషీన్ నడుస్తున్నప్పుడు విద్యుత్ లీకేజీ వల్ల షాక్ తగిలే అవకాశం ఉంది. వైబ్రేషన్, ప్రెజర్ వల్ల వైరింగ్ దెబ్బతిని తడి ప్రాంతానికి తగలొచ్చు. పైగా మెషీన్, షవర్‌కు ఒకే వేస్టేజ్ పైప్ ఉంటుంది. దీనివల్ల ప్రమాదం మరింత ఎక్కువ. అందుకే దాన్ని ఆఫ్ చేశాక 30-40 నిమిషాల తర్వాత స్నానం చేయడం మంచిది’ అని చెబుతున్నారు. #SHARE IT

News April 6, 2026

ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు

image

AP: రాష్ట్రంలో ఓవైపు ఎండలు దంచికొడుతుండగా మరోవైపు వానలు కురుస్తున్నాయి. నిన్న మన్యం(D) వీరఘట్టం, నెల్లూరు(D) నెల్లూరుపాలెంలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు శ్రీకాకుళం, నెల్లూరు, మన్యం తదితర జిల్లాల్లోని పలు చోట్ల వర్షాలు పడ్డాయి. ఈరోజు SKL, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు <<19576125>>వర్షాలు<<>> పడతాయని APSDMA వెల్లడించింది.

News April 6, 2026

పిరికివాడి మనస్తత్వం ఇలా ఉంటుంది!

image

మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్ట విచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మేడిపండు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ దాన్ని కోసి చూస్తే పురుగులు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే పిరికివాడు పైకి చాలా ధైర్యంగా, గొప్పగా మాట్లాడుతాడు. కానీ మనసులో భయంతో నిండి ఉంటాడు.
<<-se>>#PADHYAM<<>>