News December 8, 2024

‘పుష్ప-2’ మూడు రోజుల కలెక్షన్లు ఎంతంటే?

image

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా రూ.621 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ కొత్త చరిత్రను లిఖిస్తుందని పేర్కొంది. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశముంది.

Similar News

News November 26, 2025

HYD: త్వరలో కొత్త బస్ డిపోలు.. ప్రతిపాదించిన ఆర్టీసీ

image

మహానగరం విస్తరించనున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్యను పెంచి అదనపు డిపోలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రస్తుతం గ్రేటర్లో 25 డిపోల పరిధిలో 3,100 బస్సులు సేవలందిస్తున్నాయి. బస్సుల సంఖ్యను పెంచి మరో 16 డిపోలను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రచించింది. త్వరలో ఇది కార్యరూపం దాల్చనుందని సమాచారం.

News November 26, 2025

ఈ రెస్టారెంట్లో సింగిల్స్‌కు నో ఎంట్రీ!

image

దక్షిణ కొరియాలోని యోసు సిటీలోని ఓ రెస్టారెంట్ ఒంటరిగా వచ్చే వారికి అనుమతి లేదని ప్రకటించడం వివాదానికి దారితీసింది. సింగిల్‌ కస్టమర్లు ఇద్దరికి భోజనం కొనాలని లేదా ఫ్రెండ్‌/భార్యతో రావాలంటూ నిబంధనలు పెట్టింది. కొంతకాలంగా కొరియాలో “హోన్‌బాప్” అనే పేరుతో ఒంటరిగా తినే ట్రెండ్ పెరుగుతోంది. ఒంటరిగా తినడం ఒంటరితనం కాదని పలువురు అభిప్రాయపడుతుండగా, కొందరు ఈ నిర్ణయాన్ని సపోర్టు చేస్తున్నారు.

News November 26, 2025

బెట్టింగ్‌లతో అప్పులు.. గన్ తాకట్టు పెట్టిన ఎస్ఐ!

image

TG: హైదరాబాద్ అంబర్‌పేట్ SI గన్ మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపింది. ఓ కేసులో రికవరీ చేసిన బంగారంతోపాటు తన సర్వీస్ గన్‌ను SI భాను ప్రకాశ్ తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. భారీగా అప్పులు చేశారని, బెట్టింగ్‌లో రూ.80 లక్షలు పోగొట్టుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే బంగారం, తుపాకీ తాకట్టు పెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం భాను ప్రకాశ్‌ను టాస్క్‌ఫోర్స్ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది.