News January 12, 2025
‘గేమ్ ఛేంజర్’ రెండు రోజుల కలెక్షన్లు ఎంతంటే?
‘గేమ్ ఛేంజర్’ మూవీకి రెండు రోజుల్లో రూ.270 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు వైరలవుతున్నాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. తొలి రోజు రూ.186 కోట్లు వచ్చినట్లు నిర్మాతలు వెల్లడించారు. శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్, కియారా జంటగా నటించిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News January 13, 2025
నువ్వులు అధికంగా తీసుకుంటున్నారా?
సంక్రాంతి పిండి వంటల్లో నువ్వులు లేకుండా దాదాపు ఏ వంటను పూర్తి చేయరు. వీటిని పరిమితంగా తింటే గుండెకు మేలని, ఎముకలు దృఢంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే రోజూ మోతాదుకు మించి నువ్వులను తీసుకోవడం వల్ల బరువు పెరగడం, జీర్ణక్రియ సమస్యలు, రక్తపోటు తగ్గడం, అలర్జీ, కిడ్నీలో స్టోన్స్, శరీరంలో ఐరన్ పెరగడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు.
News January 13, 2025
కేజ్రీవాల్‌ది తప్పుడు ప్రచారం: రమేశ్ బిధూరీ
తనను ఢిల్లీ బీజేపీ సీఎంగా అభ్యర్థిగా ఆప్ చీఫ్ కేజ్రీవాల్ పేర్కొనడాన్ని రమేశ్ బిధూరి కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి పదవిపై తనకు ఎలాంటి ఆశ లేదని ఈ బీజేపీ నేత స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే ఆప్ చీఫ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ తనకు చాలా ఇచ్చినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
News January 13, 2025
తెలుగు రాష్ట్రాల సీఎంల సంక్రాంతి శుభాకాంక్షలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు CM రేవంత్, చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని కుటుంబాల్లో సంక్రాంతి కొత్త వెలుగులు తీసుకురావాలని రేవంత్ ఆకాంక్షించారు. పతంగులు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలని చంద్రబాబు ట్వీట్ చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే అందరి ఇళ్లలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.