News August 27, 2024
తెలంగాణ అస్తిత్వ చిహ్నాలు లేకుండా ఈ వెకిలి పనులు ఏంటి?: కేటీఆర్

TG: కాకతీయ కళాతోరణం, చార్మినార్ లేని రాజముద్రతో వరంగల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై KTR మండిపడ్డారు. ‘ఇది అధికారిక నిర్ణయమా? అనధికార నిర్లక్ష్యమా? ఏం జరుగుతుందో మీకైనా తెలుసా CS గారు? తెలంగాణ అస్తిత్వ చిహ్నాలు లేకుండా ఈ వెకిలి పనులు ఏంటి? ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు? ఒక వేళ ఆమోదించకపోతే దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి’ అని Xలో డిమాండ్ చేశారు.
Similar News
News October 27, 2025
AI సాయంతో మ్యాథ్స్‌లో రఫ్ఫాడిస్తున్నారు!

రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా విద్యార్థులు AI సాయంతో చదువులో అదరగొడుతున్నారు. ‘PadhaiWithAI’ ప్లాట్ఫామ్లో అభ్యసించేలా కలెక్టర్ సౌమ్య ఝా విద్యార్థులను ప్రోత్సహించారు. దీంతో కేవలం 6 వారాల్లో 10వ తరగతి గణితం పాస్ పర్సంటేజ్ 12% నుండి 96.4%కి పెరిగింది. ఇది సంప్రదాయ విద్యలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. కలెక్టరే స్వయంగా విద్యార్థులపై శ్రద్ధపెట్టి పర్యవేక్షించడంతో ఇది సాధ్యమైంది.
News October 27, 2025
ప్రతి కుటుంబ ఆదాయంపై కేంద్రం సర్వే

జనగణన… ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్… తాజాగా ఈ సర్వేల జాబితాలోకి మరొకటి చేరింది. పాన్ ఇండియా స్థాయిలో ఆదాయ సర్వేకు కేంద్రం నిర్ణయించింది. దేశంలో తొలిసారిగా 2026 FEB నుంచి ఈ ఆదాయ గణనను MoSPI ఆరంభిస్తుంది. ప్రతి కుటుంబ ఆదాయాన్ని లెక్కించనుంది. 2027 మధ్యలో సర్వే వివరాలు ప్రకటిస్తారు. అయితే ఇన్కమ్ వివరాలు రాబట్టడం సవాళ్లతో కూడుకున్నది కావడంతో ముందుగా ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.
News October 27, 2025
త్వరలో SBIలో 3,500 పోస్టుల భర్తీ!

వచ్చే 6 నెలల్లో ఎస్బీఐ 3500 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో 505 పీఓ పోస్టులు ఉన్నట్లు ఎస్బీఐ డిప్యూటీ ఎండీ కిశోర్ కుమార్ వెల్లడించారు. 3వేల సర్కిల్ ఆధారిత అధికారులను నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రిలిమినరీ, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా పీఓ పోస్టుల భర్తీ జరుగుతుందన్నారు. బ్యాంక్ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రిపేర్ కావొచ్చు.


