News April 24, 2025

ఉగ్రదాడి: పాకిస్థాన్ అధికారుల సెలబ్రేషన్

image

పాక్ నిజ స్వరూపం మరోసారి బయటపడింది. పహల్గాం మారణహోమం తర్వాత ఆ దేశ ప్రభుత్వం సెలబ్రేట్ చేసుకుందని తెలుస్తోంది. ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ కార్యాలయంలో కేక్ కట్ చేసుకుని ఆ దేశ దౌత్యాధికారులు రాక్షసానందం పొందారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ ఉదయం హై కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజలు భారీగా చేరుకుని పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. PoKను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News April 24, 2025

సింధు నదిలో ప్రతి నీటి చుక్కా మాదే: పాకిస్థాన్

image

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌‌తో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేయడంపై దాయాది దేశం స్పందించింది. సింధు నీటిలో ప్రతి నీటి చుక్కా తమ హక్కు అని తెలిపింది. ఒప్పందం నుంచి వైదొలగడం చట్ట వ్యతిరేకమని చెప్పింది. ఈ నిర్ణయాన్ని న్యాయ, రాజకీయపరంగా బలంగా ఎదుర్కొంటామని వివరించింది. ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు కుదిర్చిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదొలగలేదని ఆ దేశ మంత్రి అవాయిస్ లెఘారీ పేర్కొన్నారు.

News April 24, 2025

టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

image

AP: మే నెలలో జరిగే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల <>షెడ్యూల్‌<<>> విడుదలైంది.
✒ 19- ఫస్ట్ లాంగ్వేజ్& పేపర్-1(కాంపోజిట్ కోర్సు)
✒ 20- సెకండ్ లాంగ్వేజ్ ✒ 21- ఇంగ్లిష్ ✒ 22- గణితం
✒ 23- ఫిజిక్స్ ✒ 24- బయోలజీ ✒ 26- సాంఘిక శాస్త్రం
✒ 27- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2(కాంపోజిట్ కోర్సు)&OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2
✒ 28-OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2
* పరీక్షలన్నీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం

News April 24, 2025

హీరోయిన్ బేబీ బంప్(PHOTO)

image

ఇటీవల ప్రెగ్నెన్సీ ప్రకటించిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ బేబీ బంప్‌తో కనిపించారు. నిన్న రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆమె ముంబైలోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా కెమెరామెన్లు ఆమె ఫొటోలు తీయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై కియారా భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫొటోలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించారు. కాగా కియారా, సిద్ధార్థ్ 2023లో పెళ్లి చేసుకున్నారు.

error: Content is protected !!