News May 27, 2024
వర్చువల్ క్రెడిట్ కార్డులు అంటే?

భౌతిక రూపం లేకుండా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే డిజిటల్ కార్డులే వర్చువల్ క్రెడిట్ కార్డులు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. సాధారణ కార్డుల్లాగే వీటికి కూడా నంబర్, CVV, వాలిడిటీ ఉంటుంది. ఈ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ కార్డులు వన్ టైమ్ యూసేజ్ ఆప్షన్‌తో వస్తాయి. ఒకసారి వచ్చిన కార్డును 24-48hrs వరకు మాత్రమే వాడవచ్చు. కార్డు అవసరం లేనప్పుడు క్యాన్సిల్ చేయవచ్చు.
Similar News
News December 6, 2025
ఉల్లి పండిన నేలలో మల్లీ పూస్తుంది..

ఉల్లి సాగు సాధారణంగా శ్రమతో కూడుకున్నది. కొన్నిసార్లు కన్నీళ్లతో (ఉల్లి కోసేటప్పుడు) ముడిపడి ఉంటుంది. అలాంటి కఠినమైన పరిస్థితులు ఉన్న నేలలో కూడా మంచి సస్యరక్షణ చేపడితే మల్లె వంటి సువాసనగల, అందమైన పంట పెరుగుతుంది. అలాగే జీవితంలో కూడా కష్టాలతో కూడిన ఒక దశ ముగిసిన తర్వాత, అందమైన, సంతోషంతో కూడిన దశ ప్రారంభమవుతుందని, అంతా అయిపోయిన చోటు నుంచే కొత్త ఆశలు చిగురిస్తాయని ఈ సామెత అర్థం.
News December 6, 2025
శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఈ ప్రసాదాన్ని శనివారం రోజున నైవేద్యంగా పెడితే..?

శ్రీకృష్ణుడికి అటుకుల ప్రసాదమంటే ఎంతో ఇష్టమని పండితులు చెబుతున్నారు. శనివారం ఆయనకు అటుకులు, అన్నం, బెల్లం, కొబ్బరి తురుము కలిపి నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తొలగి, ఇంట్లో ధనవృద్ధి, సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. తేనె కలిపిన అటుకుల అన్నాన్ని ఆయనకు నివేదించి, ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచితే.. సంకటాలన్నీ హరించుకుపోతాయని విశ్వసిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలకు సుగుణాల భర్త వస్తాడని నమ్మకం.
News December 6, 2025
తెలుగు రాష్ట్రాలపై చలి పంజా

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. నిన్న APలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 10 డిగ్రీలు, అరకులో 11, పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు TGలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో 11-15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


