News September 20, 2025
కాలీఫ్లవర్‌పై గోధుమ రంగు మచ్చలకు కారణమేంటి?

కాలీఫ్లవర్‌పై గోధుమ రంగు మచ్చలు కనిపించడాన్ని ‘బ్రౌనింగ్’ అంటారు. సాధారణంగా క్షార నేలల్లో పెంచే పంటల్లో బోరాన్ లోపం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల పువ్వుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడటమే కాకుండా కాండం గుల్లగా మారి నీరు కారుతుంది. దీని నివారణకు ఆఖరి దుక్కిలో ఎకరానికి 8-10 కిలోల బోరాక్స్ వేసుకోవాలి. లీటరు నీటికి 1.5-2.0 గ్రాముల డైసోడియం ఆక్టాబోరెట్ కలిపి పువ్వు గడ్డ ఏర్పడే దశలో పిచికారీ చేయాలి.
Similar News
News September 20, 2025
కాసేపట్లో వర్షం..

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. యాదాద్రి భువనగిరి, జనగాం, నల్గొండ, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో వర్షం పడుతుందని అంచనా వేశారు. అటు హైదరాబాద్‌లో రాత్రి సమయంలో వర్షం పడుతుందని పేర్కొన్నారు.
News September 20, 2025
గ్రామాల్లో వృద్ధులపైనే వ్యవసాయ భారం

వ్యవసాయానికి గ్రామాలే వెన్నెముక. ఇక్కడ పండే పంటలే మిగిలిన ప్రాంతాలకు ఆధారం. నేటి యువత వ్యవసాయాన్ని విస్మరించి, జీవనోపాధి కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో నేడు వ్యవసాయం, పశుపోషణాభారం వృద్ధులపైనే పడుతోంది. ప్రస్తుతం గ్రామాల్లోని వృద్ధులు.. రైతులుగా, పశుపోషకులుగా, వ్యవసాయ కూలీలుగా, కుటుంబ సంరక్షులుగా, అనేక ఉత్పాదక పనులు చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
News September 20, 2025
‘చపాతీ, పరోటాలపై లేని GST.. ఇడ్లీ, దోశలపై ఎందుకు’

చపాతీ, పరోటాలపై పన్నును 18 నుంచి 0%కు తగ్గించిన జీఎస్టీ కౌన్సిల్ ఇడ్లీ, దోశలను యథావిధిగా 5% పరిధిలోనే ఉంచడం విమర్శలకు దారితీస్తోంది. ఇవి ఎక్కువగా దక్షిణాది వాళ్లే తింటారు. దీంతో ఉత్తరాది అల్పాహారాలపై పన్ను తీసేసి ఇక్కడి వంటకాలపై వివక్ష చూపుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో MLA రామకృష్ణ దీన్ని ప్రస్తావించడాన్ని గుర్తు చేస్తున్నారు.