News September 9, 2024
సీఎం మమత చెప్పేవి అబద్ధాలు: ట్రైనీ డాక్టర్ తల్లి

కోల్కతాలో హత్యాచారానికి గురైన వైద్యురాలి పేరెంట్స్కు పోలీసులు లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలను CM మమత ఖండించారు. దీంతో ఆమెపై మృతురాలి తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. CM అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ‘మీకు పరిహారం ఇప్పిస్తానని CM అన్నారు. మీ కూతురి జ్ఞాపకార్థం ఏదైనా నిర్మించుకోవచ్చన్నారు. అయితే నా కుమార్తెకు న్యాయం జరిగినప్పుడు మీ ఆఫీస్కు వచ్చి పరిహారం తీసుకుంటానని చెప్పా’ అని పేర్కొన్నారు.
Similar News
News November 25, 2025
వాంకిడి: కాబోయే భర్త సూసైడ్.. తట్టుకోలేక ఉరేసుకుంది

వాంకిడి(M) బంబారాకి చెందిన నీలం శ్రీలత (31) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ మహేందర్ కథనం మేరకు.. శ్రీలతకు జైపూర్(M) కిష్టాపూర్కి చెందిన రంజిత్తో పెళ్లి కుదిరింది. రంజిత్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాబోయే భర్త మరణాన్ని జీర్ణించుకోలేక శ్రీలత జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదైంది.
News November 25, 2025
శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం?

రష్యాతో పీస్ డీల్కు ఉక్రెయిన్ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ‘కొన్ని చిన్న సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సూత్రప్రాయంగా ఓకే చెప్పింది’ అని అమెరికా అధికారులు తెలిపినట్లు పేర్కొంది. అయితే చర్చలు కొనసాగుతున్నాయని, ఖరారు కాలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం అబుదాబిలో US, రష్యా బృందాలు చర్చలు జరుపుతున్నాయి.