News August 20, 2025
మీ కళ్ల రంగు ఏంటి?

ప్రపంచంలో ఎక్కువ మందికి గోదుమ రంగు కళ్లు ఉండటం చూస్తుంటాం. వీరు ప్రపంచ జనాభాలో 70%-79% ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా, ఆసియా, యూరప్, అమెరికాలో వీరు అధికంగా ఉంటారు. దీని తర్వాత నీలి రంగు కళ్లున్న వారు 8 – 10శాతం మంది ఉన్నట్లు సమాచారం. అలాగే హజెల్ 5%, అంబర్ 5%, బూడిద రంగు 3%, ఆకుపచ్చ 2%, ఎరుపు/ఊదా కళ్లున్నవారు ఒక శాతం కంటే తక్కువ మంది ఉన్నారు. ఇంతకీ మీవి ఏ కలర్?
Similar News
News August 21, 2025
డీసీఎంఎస్ కార్యాలయంలో కలెక్టర్ తనిఖీ

రైతులకు అవసరమైన మేరకు ఎరువులు అందించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కళ్యాణదుర్గంలోని డీసీఎంఎస్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. నిల్వ ఉన్న ఎరువులు, రికార్డులు పరిశీలించారు. ఎరువుల పంపిణీలో నిబంధనలు పాటించాలన్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News August 21, 2025
శుభ సమయం (21-08-2025) గురువారం

✒ తిథి: బహుళ త్రయోదశి మ.12.54 వరకు
✒ నక్షత్రం: పుష్యమి తె.1.09 వరకు
✒ శుభ సమయం: ఉ.11.13-11.49, సా.6.13-7.00 వరకు
✒ రాహుకాలం: మ.1.30-మ.3.00
✒ యమగండం: ఉ.6.00-మ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-10.48 వరకు, మ.2.48-3.36 వరకు
✒ వర్జ్యం: ఉ.9.28-11.01 వరకు
✒ అమృత ఘడియలు: రా.10.59-12.31 వరకు
News August 21, 2025
నేటి ముఖ్యాంశాలు

⋆ లోక్‌సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్రం
⋆ జైలుకెళ్లిన మంత్రుల తొలగింపు బిల్లుపై సభలో దుమారం
⋆ ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి
⋆ భవిష్యత్తులో 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం: CM రేవంత్
⋆ పేదలకు ఇళ్లు.. స్థలాలు గుర్తించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు
⋆ కర్నూలు జిల్లాలో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి
⋆ మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను తొలగించిన జియో