News March 26, 2025
బెడ్రూమ్లో ఏ కలర్ లైట్ మంచిది?

రాత్రి నిద్రపోయే సమయంలో బెడ్రూమ్లో ఎరుపు రంగు లైట్ వేసుకుంటే చక్కగా నిద్ర పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అందులోనూ తక్కువ వెలుతురు వచ్చే బల్బును ఎంపిక చేసుకొంటే మంచిది. దీంతో మెదడులో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యి నిద్ర నాణ్యత పెరుగుతుంది. అలాగే ఇష్టాలను బట్టి పసుపు, నారింజ/కాషాయం రంగులూ మంచి నిద్రకు సహకరిస్తాయి. మరోవైపు తెలుపు, నీలం రంగులు బెడ్రూమ్లో అస్సలు వాడకూడదని చెబుతున్నారు.
Similar News
News October 23, 2025
7,267 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. PGT, TGT, వార్డెన్(M, F), స్టాఫ్ నర్స్(F) తదితర పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, B.Ed, డిగ్రీ, BSc నర్సింగ్, ఇంటర్, టెన్త్ పాసైన వారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. వెబ్సైట్: https://nests.tribal.gov.in
News October 23, 2025
ఇతిహాసాలు క్విజ్ – 44

1. భరతుని మేనమామ ఎవరు?
2. ఉత్తరుడు ఎవరి కుమారుడు?
3. బ్రహ్మ నివసించే లోకం పేరు ఏమిటి?
4. గరుడ పక్షి ఏ దేవుడి వాహనం?
5. భారతదేశంలోని ఏకైక బ్రహ్మ ఆలయం ఎక్కడ ఉంది?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 23, 2025
సేంద్రియ సేద్యానికి అనుకూలం.. BPT 2841 వరి రకం

BPT 2841 అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ సన్న గింజ నల్ల బియ్యపు రకం. అధిక ప్రొటీన్, జింక్, ఇతర పోషక విలువలను కలిగి ఉంటుంది. భోజనానికి అనుకూలం. పంట కాలం 130 నుంచి 135 రోజులు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. అగ్గి తెగులు, మెడవిరుపు, దోమ పోటును తట్టుకుంటుంది. ఎకరాకు సగటున 2.4 టన్నుల దిగుబడినిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది.