News October 9, 2025
ఏ దేవుడి దర్శనానికి ఏ రంగు దుస్తులు ధరించాలి?

ఆధ్యాత్మిక నియమాల ప్రకారం.. దైవ దర్శనానికి కొన్ని రంగుల దుస్తులు ధరించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ‘లక్ష్మీదేవి, సరస్వతి, శివుడి దర్శనానికి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. గణేశుడి గుడికి వెళ్తే ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి దర్శనానికి పసుపు రంగు దుస్తులు ఉత్తమం. అయ్యప్ప స్వామి దర్శనానికి నలుపు ధరించాలి. ఫలితంగా దైవానుగ్రహం లభిస్తుంది’ అని అంటున్నారు.
Similar News
News October 9, 2025
BELలో 30 ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)30 ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు OCT 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ITI, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.590, SC, ST, PWDలకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/
News October 9, 2025
తెలంగాణ అప్డేట్స్

* ఆర్టీసీ సిటీ బస్ ఛార్జీల పెంపుకు నిరసనగా నేడు ‘చలో బస్‌భవన్’కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ నేతలు.. ఆందోళనలో పాల్గొననున్న KTR, హరీశ్ రావు
* బీఆర్ఎస్ నిరసనకు పిలుపునివ్వడం హాస్యాస్పదం: మంత్రి పొన్నం
* నేటి నుంచి HYDలోని రవీంద్రభారతిలో ఆర్టీఐ 20వ వారోత్సవాలు.. చీఫ్ గెస్ట్‌గా జిష్ణుదేవ్ వర్మ
* సింగరేణిలో సమ్మెలపై 2026 మార్చి 11 వరకు నిషేధాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ఇంధనశాఖ ఉత్తర్వులు
News October 9, 2025
ఇతిహాసాలు క్విజ్ – 30

1. అశోకవనంలో సీతాదేవికి అండగా ఉండి, ధైర్యం చెప్పిన రాక్షస స్త్రీ ఎవరు?
2. శ్రీకృష్ణుడి శంఖం పేరేంటి?
3. భాగవతం రాయమని వేద వ్యాసుడిని ప్రేరేపించింది ఎవరు?
4. సూర్యుడి వాహనం ఏది?
5. ఏకోన వింశతి: అంటే ఎంత?
✍️ సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>