News January 5, 2025

బుమ్రా హెల్త్‌పై గంభీర్ ఏమన్నారంటే?

image

ఐదో టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయకపోవడంతో బుమ్రా ఆరోగ్యంపై ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. కాగా, అతను మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నారని, వాళ్లే త్వరలో హెల్త్ అప్‌డేట్ ఇస్తారని చెప్పారు. చివరి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన బుమ్రా, బౌలింగ్‌‌ చేయలేదు. జస్ప్రీత్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు ప్రసిద్ధ్ కృష్ణ నిన్న మీడియాతో అన్నారు. కాగా ఈ సిరీస్‌లో బుమ్రా 32 వికెట్లు తీశాడు.

Similar News

News January 7, 2025

రాష్ట్రంలో పెరిగిన సముద్ర తీరం

image

AP: 1970 లెక్కలతో పోల్చితే రాష్ట్ర సముద్రతీరం పొడవు పెరిగింది. గతంలో 973.7కి.మీ. ఉన్న సాగర తీరం 8.15శాతం పెరిగి 1053.07కి.మీలకు చేరినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. మలుపులు, ఒంపులనూ లెక్కించడంతో తీరం పొడవు పెరిగింది. దీంతో మన రాష్ట్రం దేశంలోనే మూడో స్థానం(గతంలో 2వస్థానం)లో నిలిచింది. అటు 2,340.62 కి.మీలతో గుజరాత్ దేశంలోనే తొలిస్థానం, 1068.69 కి.మీ.లతో తమిళనాడు 2వ స్థానంలో నిలిచాయి.

News January 7, 2025

12న అరకులో సుప్రీం జడ్జిల బృందం పర్యటన

image

AP: పర్యాటక ప్రాంతం అరకులో ఈ నెల 12న సుప్రీంకోర్టు జడ్జిలు పర్యటించనున్నారు. CJI, 25మంది జడ్జిలు, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి రానుండటంతో అల్లూరి జిల్లా జేసీ ఏర్పాట్లు చేస్తున్నారు. వారు ఆదివారం విశాఖ నుంచి రైలులో బయలుదేరి ఉ.10.30కు అరకులోయకు చేరుకుంటారు. హరిత వేలీ రిసార్టులో విశ్రాంతి అనంతరం గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శిని, అనంతగిరి కాఫీ తోటలు, బొర్రా గుహలు సందర్శిస్తారని జేసీ తెలిపారు.

News January 7, 2025

శుక్రవారం నుంచే స్కూళ్లకు సంక్రాంతి సెలవులు

image

AP: రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించినట్లుగానే ఈనెల 10(శుక్రవారం) నుంచి హాలిడేస్ ప్రారంభం అవుతాయని తెలిపింది. సెలవులు 19న ముగిసి, 20 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని పేర్కొంది. అటు క్రిస్టియన్ స్కూళ్లకు మాత్రం 11 నుంచి 15 వరకు హాలిడేస్ ఉంటాయని వెల్లడించింది. కాగా సంక్రాంతి సెలవులు కుదిస్తారని తొలుత ప్రచారం జరిగింది.