News July 17, 2024

నటి వరలక్ష్మి కోసం ఆమె భర్త ఏం చేశాడంటే?

image

దక్షిణాది నటి వరలక్ష్మి ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరలక్ష్మి పేరును తన పేరులో కలుపుకోవడమే ఆమెకు ఇచ్చే బహుమతి అని నికోలాయ్ తెలిపారు. తాను నికోలాయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ సచ్‌దేవ్‌గా మార్చుకుంటానని, తన కూతురికీ ఇదే పేరు జత చేస్తానని చెప్పారు. దీంతో వరలక్ష్మీ శరత్ కుమార్ ఎప్పటికీ అలాగే నిలిచిపోతుందన్నారు. ఆమె పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదన్నారు.

Similar News

News October 23, 2025

మన వాళ్లను ఇక్కడికి రప్పిద్దాం.. కేంద్రం ఆలోచన

image

అమెరికా సహా విదేశాల్లో స్థిరపడిన భారత సంతతి పరిశోధకులు, నిపుణులు, ఫ్యాకల్టీని స్వదేశానికి రప్పించాలని కేంద్రం భావిస్తోంది. వారు ఇక్కడి విద్యాసంస్థల్లో బోధించేలా, రీసెర్చ్‌లు చేసేలా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. IIT వంటి ఉన్నత విద్యా సంస్థల్లో వారికి ఉద్యోగాలిచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యపై ట్రంప్ అనుసరిస్తున్న విధానాల నేపథ్యంలో ఈ దిశగా అడుగులేస్తోంది.

News October 23, 2025

వరుసగా డకౌట్లు.. కోహ్లీ కెరీర్‌లో తొలిసారి

image

లాంగ్ గ్యాప్ తర్వాత వన్డే సిరీస్ ఆడుతున్న విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా గడ్డపై ఫెయిల్ అవుతున్నారు. వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ అయ్యారు. తన కెరీర్‌లో ఇలా వరుస ODIల్లో డకౌట్ కావడం ఇదే తొలిసారి. దీంతో విరాట్‌కు ఏమైందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. రన్ మెషీన్ తిరిగి ఫామ్ అందుకోవాలని ఆశిస్తున్నారు.

News October 23, 2025

రాష్ట్రానికి తుఫాను/వాయుగుండం ముప్పు?

image

AP: అక్టోబర్ 27 నుంచి 30 మధ్యలో తుఫాను లేదా వాయుగుండం కావలి-మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణలు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తా అంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. అటు ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.