News December 1, 2024
మే 20, 2022న జస్టిస్ చంద్రచూడ్ ఏం చెప్పారు?

జ్ఞానవాపి మసీదుపై పిటిషన్ విచారణ సందర్భంగా అప్పటి CJI DY చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలే ప్రార్థనా స్థలాలపై వివాదాలకు కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మే 20, 2022న ఈ కేసును విచారిస్తూ ‘ప్రార్థనా స్థలాల ప్రాచీన స్వరూపం ఏంటన్నది నిర్ధారించడాన్ని <<14742769>>Places of Worship Act-1991<<>> అడ్డుకోద’ని మౌఖికంగా అన్నారు. దీని వల్లే ప్రార్థనా స్థలాలపై వివాదాలు అధికమయ్యాయని విపక్షాలు తప్పుబడుతున్నాయి.
Similar News
News December 18, 2025
‘బ్రహ్మపుత్ర’పై చైనా డ్యామ్.. భారత్కు ముప్పు!

యార్లంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై $168B (సుమారు రూ.1,51,860CR)తో చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్ట్ భారత్కు ఆందోళన కలిగిస్తోంది. ఈ నది కోట్లాది మందికి జీవనాధారంగా ఉంది. సుమారు 2KM ఎత్తును ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్ట్ వల్ల నది సహజ ప్రవాహం మారే ప్రమాదం ఉంది. దీంతో వ్యవసాయంపై ప్రభావం పడే అవకాశముంది. అలాగే భవిష్యత్తులో నీటిని ఆయుధంగానూ ఉపయోగించే ప్రమాదముంది.
News December 18, 2025
ఐఐటీ హైదరాబాద్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 18, 2025
గర్భంతో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చెయ్యొద్దు

గర్భధారణ సమయంలో ఒకే పొజిషన్లో ఎక్కువ సేపు ఉండడం అంత మంచిది కాదు. ప్రెగ్నెన్సీలో ఆరోగ్య సమస్యలకు సొంత వైద్యం పనికిరాదు. బరువైన వస్తువులను ఎత్తడం, అధిక పని చేయడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. మద్యం, ధూమపానం చేయకూడదు. కెఫీన్ తగ్గించాలి. పచ్చి ఆహారాలను తినకూడదని సూచిస్తున్నారు. సమయానికి తగ్గట్లు స్కానింగ్లు చేయించుకోవాలి.


