News September 16, 2024

36కి ఆలౌట్ అయినప్పుడు రవిశాస్త్రి ఏం చేశారంటే..: అశ్విన్

image

2020 ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ టెస్టులో భారత్ 36 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆరోజు రాత్రి తమ కోచ్ రవి శాస్త్రి పాటల కార్యక్రమం పెట్టారని స్పిన్నర్ అశ్విన్ తెలిపారు. ‘అందరం చాలా దిగాలుగా ఉన్నాం. దాంతో రవి మాకు డిన్నర్ ఏర్పాటు చేశారు. సాంగ్ ట్రాక్స్ పెట్టి పాటలు పాడి మాతో పాడించారు. అందర్నీ ఉత్సాహపరిచారు. ఆ తర్వాతి టెస్టులో ఘన విజయం సాధించగలిగాం’ అని గుర్తుచేసుకున్నారు.

Similar News

News November 21, 2025

‘సెన్‌యార్‌’ తుఫాన్.. ఏపీకి వర్ష సూచన

image

ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీనికి ‘సెన్‌యార్’గా పేరు పెట్టారు. ఈ తుఫాను ప్రభావంతో ఈ నెల 26 నుంచి 29 వరకు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ప్రకాశం, NLR, CTR, TPT, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

News November 21, 2025

‘సెన్‌యార్‌’ తుఫాన్ – రైతులకు సూచనలు

image

‘సెన్‌యార్‌’ తుఫాన్ వల్ల ఈ నెల 26 నుంచి 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తరుణంలో రైతులు ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి తూకం వేసిన వాటిని వెంటనే రైస్ మిల్లులకు తరలించడం మంచిది. ఆరబోసేందుకు ఉన్న ధాన్యాన్ని కుప్పలుగా చేసి టార్పాలిన్ కవర్లతో కప్పి ఉంచితే వర్షానికి తడవకుండా ఉంటుంది.

News November 21, 2025

ఎన్‌కౌంటర్లపై మావోయిస్టుల లేఖ

image

వరుసగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. అభయ్‌ పేరుతో లేఖ విడుదల చేసింది. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ పేరుతో కట్టుకథలు అల్లారని ఆరోపించింది. చికిత్స కోసం వచ్చిన <<18318593>>HIDMA<<>>ను ఎన్‌కౌంటర్ చేశారని మండిపడింది. నిరాయుధులుగా ఉన్నవారిని హత్య చేశారంది. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే హిడ్మాను పట్టుకున్నారని తెలిపింది. ఈనెల 23న దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలుపునిచ్చింది.