News February 25, 2025
35సార్లు ఢిల్లీ వెళ్లి రేవంత్ చేసిందేంటి?: కేటీఆర్

TG: 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ప్రజలకు విసుగు వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ 35 సార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు? ఇవాళ మళ్లీ హస్తిన వెళ్లి చేసేదేంటని ప్రశ్నించారు. ‘గత 48 గంటల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. SLBCలో ఎనిమిది మంది ఇరుక్కుపోయారు. రేవంత్ మాత్రం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు’ అని ఫైరయ్యారు.
Similar News
News February 25, 2025
ఆస్ట్రేలియాvsసౌతాఫ్రికా మ్యాచ్ రద్దు

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. పాయింట్స్ టేబుల్లో SA తొలి స్థానంలో, AUS రెండో స్థానంలో ఉన్నాయి. ఒకవేళ AFGపై AUS, ENGపై SA గెలిస్తే ENG, AFG ఎలిమినేట్ అవుతాయి. AUS, SA సెమీస్ చేరతాయి.
News February 25, 2025
Gold Rates: రికార్డు బ్రేక్ దిశగా పరుగులు..

బంగారం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని చేరేందుకు తహతహలాడుతున్నాయి. నేడు మోస్తరుగా పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.88,090 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 ఎగిసి రూ.80,750 వద్ద ఉంది. వెండి ధరల్లో మార్పులేదు. కిలో రూ.1,08,000 వద్ద ట్రేడవుతోంది. ట్రేడ్వార్స్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $3000 టచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది.
News February 25, 2025
ఢిల్లీకి సీఎం రేవంత్.. రేపు ప్రధానితో భేటీ

TG: సీఎం రేవంత్ కాసేపటి క్రితం ఢిల్లీకి బయల్దేరారు. రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల నిధులపై విజ్ఞప్తులు చేసే అవకాశముంది. పీఎంతో భేటీ అనంతరం ఆయన కుంభమేళాకు వెళ్లే అవకాశం ఉంది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా రేపటితో ముగియనున్న సంగతి తెలిసిందే. కుంభమేళాకు రావాలని యూపీ ప్రభుత్వం గతంలోనే సీఎం రేవంత్ను ఆహ్వానించింది.