News December 30, 2024
ఓటమిపై రోహిత్ ఏమన్నారంటే?

బాక్సింగ్ డే టెస్టులో ఓటమి నిరాశపరిచిందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. బుమ్రా ప్రదర్శన అద్భుతమని, సెంచరీ హీరో నితీశ్‌కు మంచి కెరీర్ ఉందని చెప్పారు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా కొన్ని ఫలితాలు నిరాశపరిచాయని తెలిపారు. 340 రన్స్ టార్గెట్ ఈజీ కాదని, జట్టుగా కొన్ని అంశాల్లో మెరుగవ్వాల్సి ఉందన్నారు. సిడ్నీలో జరిగే ఐదో టెస్టు తమకో అవకాశమని, మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.
Similar News
News October 22, 2025
థాంక్స్ చెబుతూనే మోదీ చురకలు!

దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పీఎం మోదీ <<18069464>>థాంక్స్ చెప్పిన <<>>విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధన్యవాదాలు చెబుతూనే ట్రంప్‌కు చురకలు అంటించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఐక్యంగా వ్యతిరేకించాలంటూ ప్రధాని హితవుపలికారు. పాక్‌ను ట్రంప్ సపోర్ట్ చేస్తుండటాన్ని పరోక్షంగా గుర్తు చేశారని, ఇదే సమయంలో భారత్ వైఖరిని స్పష్టం చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
News October 22, 2025
పోషకాల నిలయం.. BPT-2858 ఎర్ర వరి రకం

అత్యంత పోషక విలువలు గల BPT-2858 ఎర్ర బియ్యం రకాన్ని బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసింది. ఇది త్వరలో మార్కెట్లోకి రానుంది. దీని పంట కాలం 135 రోజులు. దిగుబడి హెక్టారుకు ఆరు టన్నులు. మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్ రాకుండా రోగ నిరోధక శక్తి వృద్ధి చేయడంలో ఈ రకం కీలకపాత్ర పోషిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
* రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News October 22, 2025
యూడైస్‌లో పేరుంటేనే ఇంటర్ పరీక్షలకు!

TG: యూడైస్(యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫమేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) నిబంధన ఇంటర్ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇందులో పేరు నమోదు తప్పనిసరని, అలా ఉంటేనే ఇంటర్ పరీక్షలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. యూడైస్‌లో పేరు లేకుంటే ఎగ్జామ్ ఫీజు కట్టేందుకు వీలు ఉండదు. ఇప్పటివరకు 75% విద్యార్థుల పేర్లు నమోదవ్వగా మరో 25% పెండింగ్‌లో ఉన్నాయి. ఆధార్ తప్పుల సవరణ దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు.