News March 12, 2025
ఎంగేజ్మెంట్ రింగ్‌ను సమంత ఏం చేశారంటే?

హీరోయిన్ సమంత తన నిశ్చితార్థపు ఉంగరపు డైమండ్‌ను లాకెట్‌గా మార్చుకున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. విడాకుల అనంతరం ఎంగేజ్మెంట్ రింగ్స్‌ను సరికొత్తగా మార్చుకోవడం ప్రస్తుతం ట్రెండ్‌గా మారిపోయిందని తెలిపాయి. లైఫ్‌లో ముందుకు సాగేందుకు ప్రముఖులు ఇదొక మార్గంగా ఎంచుకుంటున్నట్లు వెల్లడించాయి. తన వివాహ గౌన్‌ను కూడా బోల్డ్ బ్లాక్ బాడీకాన్‌గా మార్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నెట్టింట చర్చ జరుగుతోంది.
Similar News
News November 14, 2025
వైభవ్ ఊచకోత.. 32 బంతుల్లో సెంచరీ

మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో పసికూన UAE-Aని భారత్-A బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోస్తున్నారు. దోహాలో జరుగుతున్న టీ20లో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ కొట్టారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న వైభవ్ ఏకంగా 9 సిక్సర్లు, 10 ఫోర్లు బాదారు. దీంతో ఇండియా-A 10 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 149 రన్స్ చేసింది.
News November 14, 2025
వాళ్లు ఏ వేషంలో వచ్చినా అవకాశం రాదు: అమిత్ షా

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA గెలుపుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఇది వికసిత్ బిహార్‌పై నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరి విజయమని అన్నారు. జంగిల్ రాజ్, బుజ్జగింపు రాజకీయాలు చేసే వారు ఏ వేషంలో వచ్చినా దోచుకునేందుకు అవకాశం లభించదని ట్వీట్ చేశారు. పని తీరు ఆధారంగా ప్రజలు తీర్పు చెప్పారని పేర్కొన్నారు. బిహార్ ప్రజల ప్రతి ఓటు మోదీ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకానికి చిహ్నమని చెప్పారు.
News November 14, 2025
టెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ <


