News January 2, 2025
తొక్కిసలాట ఘటనపై బాలీవుడ్ నిర్మాత ఏమన్నారంటే?

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ను నిందించాల్సిన అవసరం లేదని నిర్మాత బోనీ కపూర్ అన్నారు. జనాలు ఎక్కువ మంది రావడంతోనే ఈ ఘటన జరిగిందని అభిప్రాయపడ్డారు. దక్షిణాదిలో ప్రేక్షకులకు హీరోలపై అభిమానం ఎక్కువని తెలిపారు. రజినీ కాంత్, చిరంజీవి, మహేశ్ బాబు వంటి స్టార్ల సినిమాలకు అభిమానులు ఇలానే వస్తారన్నారు. కాగా తొక్కిసలాట ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్ బెయిల్పై విడుదలయ్యారు.
Similar News
News December 6, 2025
శబరిమలలో శ్రీకాకుళం జిల్లా వాసి మృతి

శబరిమలలో శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు పంచాయతీ కూటికుప్పలపేటకు చెందిన గురుగుబెల్లి వరాహ నరసింహులు (72) మృతి చెందారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లగా శుక్రవారం గుండెపోటుతో మృతిచెందినట్లు తోటి భక్తులు మృతుని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్లో స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువస్తున్నారు.
News December 6, 2025
ఇండిగో సంక్షోభం: CJI జోక్యం చేసుకోవాలని పిల్

ఇండిగో సంక్షోభంపై CJI జోక్యం చేసుకోవాలని కోరుతూ పిల్ దాఖలైంది. విమానయాన శాఖ, DGCA నుంచి స్టేటస్ రిపోర్టు తీసుకోవాలని, తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో అత్యవసర విచారణ కోసం పిటిషనర్ న్యాయవాదిని తన నివాసానికి పిలిపించి CJI మాట్లాడనున్నారని సమాచారం. మరోవైపు ఇండిగో సర్వీసులపై సమాచారం తెలుసుకుని రావాలని ప్రయాణికులను బెంగళూరు ఎయిర్పోర్టు కోరింది.
News December 6, 2025
NCCDలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్చైన్ డెవలప్మెంట్లో 5 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ(అగ్రి బిజినెస్), ఎంకామ్, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: nccd.gov.in.


