News September 12, 2025

బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం ఏమన్నారంటే?

image

AP: భవిష్యత్తు కోసమే పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును తలపెట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘నీళ్లు ఉంటేనే సుస్థిర అభివృద్ధి సాధ్యం అవుతుంది. రాయలసీమకు నీళ్లు ఇస్తే దేశంలోనే నం.1గా మారుతుంది. గోదావరిలో పైన ఉండే నీటిని తెలంగాణ వాడుకోవచ్చు. మేము సముద్రంలోకి వెళ్తోన్న నీటినే వాడుకుంటాం. అందుకే బనకచర్ల కట్టాలని ప్రతిపాదించాం’ అని వే2న్యూస్ కాన్‌క్లేవ్‌లో చెప్పారు.

Similar News

News April 4, 2026

మహబూబాబాద్ జిల్లాలో కార్యదర్శులకు డిప్యుటేషన్ల ఉత్తర్వులు

image

మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరిష్ ఆధ్వర్యంలో జిల్లా పరిపాలన కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖలో 482 జీపీలకు 416 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. శనివారం 406 మంది పంచాయతీ సెక్రటరీలను డిప్యూటేషన్‌పై నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపారు.

News April 4, 2026

విద్యార్థుల నుంచి ఫీజుల్ని వసూలు చేసుకోవచ్చు: హైకోర్టు

image

TG: ప్రభుత్వం రీయింబర్స్‌మెంటు నిధుల విడుదలలో విఫలమైతే ఇంజినీరింగ్ కాలేజీలు 2026-27లో విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. ప్రభుత్వం నిధులు విడుదల చేశాక తిరిగి విద్యార్థులకు ఆ ఫీజుల మొత్తాలను రిఫండ్ చేయాలని ఆదేశించింది. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు విడుదల చేయకపోవడంపై కాలేజీలు దాఖలు చేసిన 14 పిటిషన్లను విచారించిన కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

News April 4, 2026

పచ్చి పేడను నేరుగా పొలంలో వేస్తున్నారా?

image

పశువుల పేడను సరైన విధానంలో వాడితే పంటకు మేలు చేస్తుంది. అయితే చాలా మంది రైతులు పచ్చి పశువుల పేడను నేరుగా పొలంలో చల్లుతుంటారు. దీని వల్ల పంటకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందంటున్నారు నిపుణులు. పచ్చి పేడలో ఉండే నులిపురుగులు మొక్క వేర్లను ఆశించి పంటను దెబ్బతీస్తాయి. అందుకే పేడను మగ్గబెట్టి వాడటం మంచిదని చెబుతున్నారు. దీని వల్ల భూసారం పెరగడంతో పాటు పంట దిగుబడి కూడా బాగుంటుందని చెబుతున్నారు.