News April 5, 2025

తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్‌పై కోచ్ ఏమన్నారంటే?

image

LSGతో మ్యాచ్‌లో MI బ్యాటర్ తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్ నిర్ణయం చర్చనీయాంశమైన వేళ కోచ్ జయవర్దనే స్పందించారు. ‘సూర్య ఔట్ అయినా అప్పటికే క్రీజులో కుదురుకున్న తిలక్ రన్స్ చేస్తాడని చివరి ఓవర్ల వరకు వేచి చూశాం. కానీ, అతను బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో చివరకు కొత్త బ్యాటర్ అవసరమని భావించి ఆ నిర్ణయం తీసుకున్నాం. క్రికెట్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయి. ఆ సమయంలో అది వ్యూహాత్మక నిర్ణయం’ అని అన్నారు.

Similar News

News January 8, 2026

అమరావతిపై జగన్ వ్యాఖ్యలు.. మంత్రుల దండయాత్ర

image

AP: జగన్ అమరావతిపై చేసిన <<18799615>>కామెంట్స్<<>> రాష్ట్రంలో ముందుగానే భోగి మంటలు రాజేశాయి. మంత్రులు ఒక్కొక్కరుగా కౌంటర్ అటాక్‌కు దిగారు. ఇటీవల YCP చేసిన ఏ ఆరోపణల మీదా ఇలా వెంటనే ఎదురుదాడి చేయలేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాష్ట్రానికి కీలకమైన అంశం, రూ.వందల కోట్ల మేర పనులు జరుగుతున్న ప్రాంతంపై ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్లొద్దనే ఇలా రియాక్ట్ అయినట్లు టాక్.

News January 8, 2026

3 మ్యాచులకు తిలక్ వర్మ దూరం

image

న్యూజిలాండ్‌తో జరిగే 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో తొలి 3 మ్యాచులకు తిలక్ వర్మ దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. మిగతా 2 మ్యాచుల్లో ఆయన ఆడే విషయంపై ఫిట్‌నెస్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. నిన్న ఆయనకు సర్జరీ జరిగినట్లు పేర్కొంది. తిలక్ ఆస్పత్రి నుంచి ఈరోజు డిశ్చార్జ్ అయ్యారని, రేపు HYDకు వస్తారని వెల్లడించింది. IND, NZ టీ20 సిరీస్ ఈ నెల 21 నుంచి జరగనుంది.

News January 8, 2026

కొడుక్కు ఇచ్చిన మాట.. 75% సంపాదన సమాజానికి!

image

తన కొడుకు అగ్నివేశ్(49) <<18794363>>ఆకస్మిక మరణం<<>> నేపథ్యంలో వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కుమారుడికి ఇచ్చిన మాట ప్రకారం తమ సంపాదనలో 75% సమాజానికి ఇస్తానని తెలిపారు. ‘ఆకలితో ఎవరూ నిద్రపోకూడదని, విద్యకు దూరం కాకూడదని, స్త్రీలు తమ కాళ్లపై నిలబడాలని, యువతకు సరైన పని ఉండాలని కలలు కన్నాం. మేం ఆర్జించిన దాంట్లో 75% సొసైటీకి వెనక్కివ్వాలని అగ్నికి ప్రామిస్ చేశా’ అని చెప్పారు.