News November 20, 2024
ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం ఏం చెప్పింది?
ఎగ్జిట్ పోల్స్ విషయంలో సర్వే సంస్థలకు స్వీయ నియంత్రణ అవసరమని కేంద్ర ఎన్నికల సంఘం గతంలో వ్యాఖ్యానించింది. ‘ఎన్ని శాంపిల్స్ సేకరించారు? ఎక్కడ సర్వే చేశారు? ఒక వేళ ఫలితాలు అంచనాలకు విరుద్ధంగా వస్తే సంస్థలు ఎంతవరకు బాధ్యత తీసుకుంటాయి?’ అని ప్రశ్నించింది. సర్వేలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. అంచనాలు, ఫలితాలు విరుద్ధంగా ఉండడం సమస్యకు దారి తీస్తుందని పేర్కొంది.
Similar News
News November 20, 2024
యమహా RX-100: మళ్లీ వస్తోంది!
ఓ తరం మొత్తాన్ని ఆకట్టుకున్న యమహా RX 100 మళ్లీ మార్కెట్లోకి రానుంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో లాంచ్ కావొచ్చని అంచనా. రూ.1.40లక్షల నుంచి రూ.1.50లక్షల మధ్యలో ధర ఉండొచ్చని మార్కెట్ వర్గాలంటున్నాయి. 100 CC సింగిల్ సిలిండర్ ఇంజిన్, ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ, 5 స్పీడ్ గేర్ బాక్స్, 70 కి.మీ మైలేజీ దీని ప్రత్యేకతలుగా తెలుస్తోంది. డిజైన్ విషయంలో పాత స్టైల్‌నే అనుసరించినట్లు సమాచారం.
News November 20, 2024
మహిళల్లో ఈ సమస్యలు.. కారణం అదేనా?
చాలామంది మహిళలు రుతుక్రమం సరిగ్గాలేక ఇబ్బందులు పడుతుంటారు. అధికంగా జింక్ తీసుకోవడమే దీనిక్కారణం కావొచ్చని పుణే వైద్యురాలు సునీత తాండూల్వాడ్కర్ పేర్కొన్నారు. ‘ఆరోగ్యానికి జింక్ అవసరమే. కానీ దాని స్థాయులు ఎక్కువైనప్పుడు ఒంట్లోకి ఇతర మినరల్స్‌ని రానివ్వదు. అండం విడుదలను, రుతుక్రమాన్ని అస్థిరపరుస్తుంది. రోజుకు 14 మిల్లీగ్రాములకు మించి జింక్ శరీరానికి అవసరం లేదు’ అని స్పష్టం చేశారు.
News November 20, 2024
మహారాష్ట్రలో ముగిసిన పోలింగ్.. కాసేపట్లో WAY2NEWSలో ఎగ్జిట్ పోల్స్
మహారాష్ట్రలో పోలింగ్ ముగిసింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు, ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 58శాతం ఓటింగ్ నమోదైంది. ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్, ఈనెల 23న ఫలితాలు వెలువడతాయి. ఎగ్జిట్ పోల్స్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా WAY2NEWS యాప్‌లో చూడండి.