News March 8, 2025

అమరావతి పనుల ప్రారంభంపై మంత్రి ఏమన్నారంటే?

image

AP: మార్చి 12 నుంచి 15లోపు అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. 2014-19 మధ్య ఖరారు చేసిన డిజైన్లలో ఎలాంటి మార్పు ఉండదని, న్యాయపరమైన సమస్యలు రాకుండా ముందుకెళ్లేందుకు 7 నెలల సమయం పట్టిందన్నారు. భూములు అమ్మి మాత్రమే రాజధాని నిర్మాణం చేస్తామని, ప్రజల పన్నుల ఆదాయం నుంచి ఒక్క రూపాయి కూడా అమరావతికి ఖర్చు పెట్టబోమని స్పష్టం చేశారు.

Similar News

News February 6, 2026

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. ఇకనైనా మారండి!

image

ఢిల్లీలోని జనక్‌పురిలో జలమండలి తవ్విన లోతైన గుంతలో పడి ఓ బైకర్ మృతి చెందాడు. కనీస హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు, లైట్లు లేకపోవడమే ఈ ఘోరానికి కారణం. ప్రజల నుంచి రోడ్ ట్యాక్స్, జీఎస్టీలు వసూలు చేస్తున్న ప్రభుత్వాలు కనీస భద్రత కల్పించడంలో విఫలమవుతున్నాయనే చర్చ జరుగుతోంది. ప్రాణాలు పోతుంటే అధికారులు ఇంకెన్నాళ్లు నిర్లక్ష్యంగా ఉంటారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి.

News February 6, 2026

ఇన్‌స్ట్రుమెంటేషన్ లిమిటెడ్‌లో పోస్టులు.. అప్లై చేశారా?

image

కేరళలోని ఇన్‌స్ట్రుమెంటేషన్ లిమిటెడ్‌లో 81 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, డిగ్రీ(ఇంజినీరింగ్) అర్హతగల వారు ఫిబ్రవరి 9 వరకు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,300, డిప్లొమా హోల్డర్లకు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ilpgt.com

News February 6, 2026

‘ఢిల్లీని షేక్ చేస్తాం’.. లష్కరే టెర్రరిస్టు ప్రేలాపనలు

image

ఇండియాలోని ప్రధాన సిటీల్లో దాడులు చేస్తామంటూ లష్కరే తోయిబా (LeT) టెర్రరిస్టు సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్ నఖ్వీ హెచ్చరించాడు. ‘అఖండ భారత్‌ను ఖండఖండాలుగా చేస్తాం. ఆగ్రాకు నిప్పు పెడతాం. దక్కన్‌ను మండిస్తాం. ఢిల్లీని షేక్ చేస్తాం’ అని లాహోర్‌లో ప్రేలాపనలు చేశాడు. కశ్మీర్‌కు విముక్తి కల్పిస్తామని చెప్పాడు. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ ఏటా ఫిబ్రవరి 5న <<19062687>>కశ్మీర్ సంఘీభావ దినోత్సవాన్ని<<>> నిర్వహిస్తోంది.