News March 18, 2024
సింగర్ మంగ్లీ కారు ప్రమాదంపై పోలీసులు ఏమన్నారంటే?

రోడ్డు ప్రమాదంలో సింగర్ మంగ్లీకి గాయాలయ్యాయని వస్తోన్న వార్తలపై పోలీసులు స్పందించారు. ‘శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగ్లీ సురక్షితంగా బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తోన్న కారును వెనుక నుంచి డీసీఎం వాహనం ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తోన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. కారు ఇండికేటర్ మాత్రమే పగిలింది’ అని తెలిపారు.
Similar News
News April 18, 2025
‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ పబ్లిక్ టాక్

కళ్యాణ్ రామ్, విజయశాంతి కీలకపాత్రల్లో నటించిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా ప్రీమియర్ షోలు స్టార్ట్ అయ్యాయి. ఈ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో యాక్షన్ సీన్స్ బాగున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందంటున్నారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి నటన మూవీకి ప్లస్ పాయింట్ అని, అయితే స్టోరీ ఊహించేలా ఉందని పోస్టులు చేస్తున్నారు. కాసేపట్లో Way2News ఫుల్ రివ్యూ.
News April 18, 2025
IAS స్మిత సభర్వాల్ తగ్గేదేలే..!

TG: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మార్ఫింగ్ ఫొటోను రీట్వీట్ చేసి నోటీసులు అందుకున్న సీనియర్ IAS ఆఫీసర్ స్మిత సభర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్లీ ఎక్స్‌లో రెండు మూడు పోస్టులను ఆమె రీట్వీట్ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించిన ఓ పోస్టును స్మిత రీట్వీట్ చేశారు. ఈ పోస్టుల్లోనూ AIతో క్రియేట్ చేసిన నెమళ్లు, బుల్డోజర్లు ఉండటం విశేషం.
News April 18, 2025
పార్లమెంట్ హాజరులో MPలు కలిశెట్టి, హరీశ్ టాప్

AP: 18వ పార్లమెంట్ సమావేశాలకు TDP MPలు కలిశెట్టి అప్పలనాయుడు, GM హరీశ్ 99 శాతం హాజరై టాప్‌లో నిలిచారు. వైజాగ్ MP శ్రీభరత్ (97), చిత్తూరు MP ప్రసాద్ (93) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తక్కువ హాజరుతో YCP MP అవినాశ్ (54) చివరి స్థానంలో ఉన్నారు. ప్రశ్నలు సంధించడంలోనూ కలిశెట్టి ముందున్నారు. ఆయన మొత్తం 89 ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత మాగుంట (84) ఉన్నారు. జనసేన MP తంగెళ్ల ఉదయ్ తక్కువగా 22 ప్రశ్నలే అడిగారు.