News April 11, 2024
LIVEలో కుక్కపిల్ల ఏం చేసిందంటే..

బొలీవియాలోని ఓ న్యూస్ ఛానల్ సిబ్బందికి ఓ కుక్కపిల్ల షాకిచ్చింది. జంతువుల దత్తతను ప్రోత్సహించడానికి ఒక వీధి కుక్కపిల్లను లైవ్ న్యూస్ ప్రోగ్రామ్లోకి తీసుకొచ్చారు. న్యూస్ యాంకర్ ఆ కుక్కపిల్లను తడుముతూ మాట్లాడుతుండగా.. అది డెస్క్పైనే మల విసర్జన చేసింది. దీంతో ప్రోగ్రామ్లో ఉన్నవారంతా అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను న్యూయార్క్ పోస్ట్ వెబ్సైట్లో పంచుకుంది.
Similar News
News November 20, 2025
ఎట్టకేలకు బదిలీలు.. వరుస వివాదాల నేపథ్యంలో చర్యలు!

వేములవాడ రాజన్న ఆలయంలో ఎట్టకేలకు ఉద్యోగుల అంతర్గత బదిలీలు చేపట్టారు. ఓ ఉద్యోగి అక్రమంగా సరకులు తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిపి చర్య తీసుకోవడానికి బదులుగా మీడియాపై ఎదురుదాడికి దిగడం, వార్తల కవరేజీకి సహకరించకపోవడం పట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమయ్యారు. BJP ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించింది. నేడు ధర్నా ప్రకటించడంతో దిగివచ్చిన ఆలయ అధికారులు అంతర్గత బదిలీలు చేపట్టారు.
News November 20, 2025
బాబు లుక్స్ అదిరిపోయాయిగా..

సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ‘వారణాసి’ మూవీ కోసం హైదరాబాద్లో హాలీవుడ్ మీడియాతో ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. బాబు కోసం హాలీవుడ్ HYDకు వచ్చిందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. ఆయన లుక్స్ అదిరిపోయాయని, మూవీ విడుదలయ్యే వరకు ఇలా ఫొటోల్లో కనిపించినా చాలని మరికొందరు అంటున్నారు.
News November 20, 2025
ఆవుల డెయిరీ, గేదెల డెయిరీ.. దేనితో లాభం?

స్థానికంగా ఆవు, గేదె పాలకు ఉన్న డిమాండ్ బట్టి ఫామ్ ప్రారంభించాలి. గేదె పాలకు అధిక ధర వస్తున్నా, స్థానిక గేదెలు తక్కువ పాలివ్వడం, అధిక పాలిచ్చే ముర్రాజాతి గేదెల ధర ఎక్కువ కావడం, సకాలంలో ఎదకు రాకపోవడంతో చాలా మంది నష్టపోతున్నారు. అందుకే ఏడాదిలో 280-300 రోజుల పాటు అధిక పాల దిగుబడినిచ్చే జెర్సీ, హోలిస్టిన్ ఫ్రీజియన్ ఆవులతో ఫామ్ నడపడం మేలంటున్నారు నిపుణులు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.


