News November 14, 2024
నా రూమ్‌కి వచ్చి తిలక్ ఏం అడిగారంటే.: సూర్య

నిన్నటి SAvsIND మ్యాచ్‌లో తిలక్ వర్మ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌కు ముందు ఆయన తన గదికి వచ్చారని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘3వ స్థానంలో తాను ఆడతానని తిలక్ నా రూమ్‌కి వచ్చి మరీ రిక్వెస్ట్ చేశారు. అతడిపై విశ్వాసంతో సరేనన్నాను. ఆ నమ్మకాన్ని సెంచరీతో నిలబెట్టుకున్నారు’ అని కొనియాడారు. గత మ్యాచ్‌లలో సూర్య వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చారు.
Similar News
News December 12, 2025
‘అఖండ-2’ మూవీ రివ్యూ&రేటింగ్

దైవంపై పడిన నింద తొలగించడం, హిందూ ధర్మ పరిరక్షణకు అఖండ ఏం చేశారనేది స్టోరీ. బాలకృష్ణ నట విశ్వరూపం చూపించారు. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలైట్. తమన్ BGM&యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. దేశభక్తి, సనాతన ధర్మంపై డైలాగులు మెప్పిస్తాయి. దేశంతో దైవానికి లింక్ చేసి హైందవ ధర్మాన్ని చెప్పేలా బోయపాటి కథ అల్లారు. కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. ఫస్టాఫ్ ట్రిమ్ చేయాల్సింది. విలనిజం పండలేదు.
రేటింగ్: 2.75/5.
News December 12, 2025
వారణాసిలో 5 గెటప్‌లలో మహేశ్ బాబు!

రాజమౌళి-మహేశ్ కాంబోలో రూపొందుతున్న ‘వారణాసి’ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వైరలవుతోంది. మహేశ్ 5 పాత్రల్లో కన్పిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి. విజువల్ వండర్‌గా, సరికొత్త యాక్షన్ ప్యాక్డ్ అవతారాలలో హీరోను తెరపై చూపించనున్నారని టాక్ నడుస్తోంది. ‘రుద్ర’, రాముడిగా కనిపిస్తారని ఇప్పటికే రాజమౌళి 2 గెటప్‌లను రివీల్ చేయగా, మిగతా 3 ఏమై ఉంటాయని చర్చ జరుగుతోంది. ఈ ప్రచారం నిజమైతే మహేశ్ ఫ్యాన్స్‌కు పండగే.
News December 12, 2025
మరణించినట్లు కలలు వస్తే.. అది దేనికి సంకేతం?

ఓ వ్యక్తికి తాను చనిపోయినట్లు పదేపదే కలలు వస్తుంటే భయపడాల్సిన అవసరం లేదని స్వప్నశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇది మంచి ఫలితాన్నే సూచిస్తుందని అంటున్నారు. ‘ఏదైనా సంక్షోభం లేదా మరణ ముప్పు ఇప్పటికే దాటిపోయిందని, దాని నుంచి మీరు తప్పించుకున్నారని ఈ కలలు సూచిస్తాయి. అయితే ప్రమాదానికి గురైనట్లు కలలు వస్తే దాన్ని హెచ్చరికలా భావించి జాగ్రత్తగా ఉండాలి’ అని సూచిస్తున్నారు.


