News September 11, 2024
స్నేహితురాలి ఆవేదన చూడలేక ఏం చేసిందంటే..

AP: గుంటూరు GGHలో మీరాబీ అనే గర్భిణీ ఇటీవల మృత శిశువుకి జన్మనిచ్చింది. ఆమె మనోవేదన చూసి తల్లడిల్లిన స్నేహితురాలు ప్రభావతి ఆవేదన తీర్చాలనుకుంది. అనారోగ్యంతో చనిపోయిన ఓ బాలింత భర్తను సంప్రదించి రూ.2లక్షలకు వారి ఆడ శిశువును కొనుగోలు చేసి, బిడ్డను మీరాబీ ఒడిలోకి చేర్చింది. అయితే ఆస్పత్రి సిబ్బంది అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా శిశువు విక్రయం సంగతి బయటపడింది.
Similar News
News September 19, 2025
జగన్‌లా గతంలో ఎవరూ ఇంట్లో కూర్చోలేదు: సోమిరెడ్డి

AP: వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలికి వచ్చి ప్రశ్నిస్తుంటే, మాజీ సీఎం జగన్ శాసనసభకు ఎందుకు రావట్లేదని TDP MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతి సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆయన వివరించారు. ప్రతిపక్ష హోదా కోసం గతంలో ఏ నాయకుడూ జగన్‌లా ఇంట్లో కూర్చోలేదని ధ్వజమెత్తారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేస్తే, ప్రతిపక్ష హోదా కావాలని కోరడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
News September 19, 2025
మునగాకుతో జుట్టు సమస్యలకు చెక్

మునగాకులలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మునగాకు పొడిని హెయిర్ ప్యాక్‌గా వాడుకోవచ్చు. టేబుల్ స్పూన్ మునగాకు పొడికి కొంచెం పెరుగు కలిపి పేస్టులా చేసుకోవాలి. దీన్ని కుదుళ్లకు పట్టేలా వేసుకొని అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో చుండ్రు, దురద తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యవంతంగా, నిగనిగలాడుతుంది.
News September 19, 2025
TDPలో చేరనున్న ముగ్గురు YCP ఎమ్మెల్సీలు?

AP: వైసీపీ ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు వీరు ముగ్గురు రాజీనామా చేశారు. కాగా వీరి రాజీనామాలపై మండలి ఛైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.