News August 6, 2024
యాపిల్ పండ్లపై ఉండే స్టిక్కర్లు దేనికి సంకేతం?

యాపిల్స్‌పై ఉండే స్టిక్కర్లు వాటి నాణ్యతను, పెరిగిన విధానాన్ని తెలియజేస్తాయి. 4తో ప్రారంభమయ్యే 4 డిజిట్ స్టిక్కర్(ex:4026) ఉన్న పండ్లు ఎరువులు, రసాయనాలతో పండించినవి. 8తో ప్రారంభమైన 5 డిజిట్ నంబర్(ex:84131) ఉన్న ఫ్రూట్స్ సహజంగా కాకుండా జన్యుమార్పిడితో పెంచినవి. ఒకవేళ స్టిక్కర్‌పై 9తో ప్రారంభమయ్యే 5 డిజిట్ కోడ్(ex:93505) ఉంటే ఆ పండ్లు సహజంగా పండించినవి అని అర్థం.
Similar News
News April 10, 2026
ఇరాన్ కొత్త నాయకత్వం ఇంకా డేంజర్: IDF

ఇరాన్‌లో ఇప్పుడున్న నాయకత్వం మరింత ఎక్స్‌ట్రీమ్‌గా ఉందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) హెచ్చరించింది. ఖమేనీ చనిపోయిన తర్వాత ఏర్పడిన కొత్త లీడర్‌షిప్ సంప్రదాయ మత పెద్దల నుంచి కాకుండా IRGC నుంచి వచ్చిందని తెలిపింది. ఈ మేరకు రహస్య సమావేశంలో IDF ప్రతినిధులు పార్లమెంటు ఫారిన్ అఫైర్స్ కమిటీకి తెలియజేశారు. ఈ క్రమంలో యుద్ధం తిరిగి ప్రారంభం కావచ్చని కమిటీ చీఫ్ బోవజ్ బిస్ముత్ అభిప్రాయపడ్డారు.
News April 10, 2026
IPL: రాత్రి 8.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం

IPL అభిమానులకు గుడ్‌న్యూస్. RCB-RR మ్యాచ్ జరగాల్సిన గువాహటి స్టేడియం వద్ద వర్షం తగ్గింది. సిబ్బంది కవర్లు తొలగించారు. ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అంపైర్లు రా.8 గంటలకు టాస్ వేయనున్నారు. రా.8.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పూర్తి ఓవర్ల గేమ్ జరగనుంది.
News April 10, 2026
మెలానియా ప్రకటన.. టైమింగ్ వెనక పెద్ద ప్లాన్?

మెలానియా సడన్‌గా ఎప్‌స్టీన్ గురించి <<19611865>>మాట్లాడటం<<>> వెనక అనేక థియరీలు వినిపిస్తున్నాయి. ఆమె ప్రసంగంలో ఎక్కడా ట్రంప్‌ను సమర్థించకపోవడంతో విడాకుల రూమర్లు వస్తున్నాయి. మరోవైపు ఇరాన్ యుద్ధంలో ట్రంప్ విఫలమవుతుండటంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ప్లాన్ చేశారనే వాదనలు ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ఎప్‌స్టీన్ రహస్య ఈమెయిల్స్ ద్వారా ఏదైనా పెద్ద విషయం బయటకొస్తుందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.


