News November 18, 2024
‘బరి తెగించిపోతున్నాడు’ అంటే?
ఎవరైనా హద్దుమీరి మాట్లాడినా, చెప్పిన మాటలను లెక్కచేయకున్నా.. బరితెగించి పోతున్నాడు అంటాం. అసలు బరి అంటే ఏంటో తెలుసా? కుస్తీలో పోరాడవలసిన స్థల పరిమితులను బరి అని పిలుస్తుంటారు. దానిని దాటిన వ్యక్తి బరితెగించి పోతున్నాడు అంటారు. సమాజంలో ఉన్నప్పుడు కొన్ని ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని ఉల్లంఘించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే అలాంటి వ్యక్తులను బరితెగించి పోతున్నాడు అని అంటుంటారు.
Similar News
News November 18, 2024
రాష్ట్రంలో ఇంటింటి సర్వే 65.02% పూర్తి
TG: రాష్ట్ర వ్యాప్తంగా 75,75,647 నివాసాల్లో సమగ్ర సర్వే పూర్తి అయింది. దీంతో ఇంటింటి కుటుంబ సర్వే 65.02 శాతం పూర్తి అయినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ములుగు జిల్లా 95.3శాతంతో తొలి స్థానంలో నిలిచింది. నల్గొండ 89.1, జనగామ 86 శాతం సర్వేతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. GHMCలో అతి తక్కువగా 44.3 శాతం సర్వే పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు.
News November 18, 2024
బంగారు టూత్‌బ్రష్‌తో హీరోయిన్
స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన ఓ పోస్ట్ వైరలవుతోంది. బంగారంతో చేసిన టూత్‌బ్రష్‌ను చేతపట్టుకున్న ఫొటోను పోస్టు చేస్తూ ‘నోటితో చెప్పకుండానే నువ్వు సింధీ అమ్మాయివని ఎలా చెప్తానంటే’ అని క్యాప్షన్ ఇచ్చారు. సింధీ ప్రజలకు బంగారంపై ఉండే ఇష్టాన్ని, వారి కల్చర్‌ను పరోక్షంగా చెప్పారు. ఈ పోస్టుపై కొందరు సానుకూలంగా స్పందిస్తుండగా, మరికొందరు షో ఆఫ్‌లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
News November 18, 2024
టీడీపీ ఎమ్మెల్యేకు ‘విజనరీ లీడర్’ అవార్డు
AP: పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు బ్రిటన్ పార్లమెంట్ విజనరీ లీడర్ అవార్డును ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఆయన లండన్ వెళ్లలేకపోయారు. ఆయన స్థానంలో యూకే ఎన్ఆర్ఐ టీడీపీ వ్యవహారాల నేత గోపాల్ పురస్కారం అందుకున్నారు. అరుదైన అవార్డు సాధించిన ఏలూరికి సీఎం చంద్రబాబు, మంత్రులు ఫోన్ చేసి అభినందించారు.