News September 9, 2024
హైకోర్టు తీర్పుపై కడియం శ్రీహరి ఏమన్నారంటే?

TG: ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంలో హైకోర్టు <<14057734>>తీర్పుపై<<>> MLA కడియం శ్రీహరి స్పందించారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత BRSకు లేదని దుయ్యబట్టారు. రాజకీయాలను ఆ పార్టీ భ్రష్టు పట్టించిందని విమర్శించారు. కోర్టు తీర్పును అధ్యయనం చేయాల్సిన అవసరముందన్నారు. అవసరమైతే డివిజన్ బెంచ్ను ఆశ్రయిస్తామని తెలిపారు. గతంలో కాంగ్రెస్, సీపీఐ, వైసీపీ, టీడీపీ నాయకులను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుందని మండిపడ్డారు.
Similar News
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 18, 2025
మైథాలజీ క్విజ్ – 9

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>