News August 14, 2024

‘ఖడ్గం-2’ సినిమాపై కృష్ణవంశీ ఏమన్నారంటే?

image

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖడ్గం’ మూవీ ఆయన కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాకు పార్ట్-2 చేయాలని అడిగిన ఓ నెటిజన్‌కు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘పార్ట్-2ల మీద నాకు నమ్మకం లేదండి. చేతకాదు. అందువల్ల ఖడ్గం-2 ఉండదు. కానీ సామాజిక సమస్యలపై చిత్రం ఉంటుంది’ అని బదులిచ్చారు. శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్ వంటి స్టార్లు ‘ఖడ్గం’లో ప్రధాన పాత్రల్లో కనిపించారు.

Similar News

News December 22, 2025

ఇతిహాసాలు క్విజ్ – 104

image

ఈరోజు ప్రశ్న: పురాణాల ప్రకారం ఓ నెల పురుషుడిగా, మరో నెల స్త్రీగా మారుతూ.. రెండు వంశాలకు ప్రతినిధిగా నిలిచిన వ్యక్తి ఎవరు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 22, 2025

ICMRలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (<>ICMR<<>>)లో 7 సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS, MD, MS, PhD, B.V.Sc&AH, MVSc& AH, PG(బయో మెడికల్ సైన్సెస్), ఫార్మా డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://recruitment.icmr.org.in

News December 22, 2025

ఏ పంటకు ఎన్ని బస్తాల యూరియా ఇస్తారు?

image

TG: వరికి ఎకరానికి రెండున్నర బస్తాలు.. చెరుకు, మిరప, మొక్కజొన్న పంటలకు ఎకరానికి 5 బస్తాల వరకే బుక్ చేసుకోవాలి. అంతకు మించి బుక్ చేసుకునే వీలులేదు. ఒకసారి బుకింగ్ చేసుకుంటే 24 గంటల్లో యూరియా తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోకుంటే బుకింగ్ రద్దు అవుతుంది. 15 రోజుల్లో మళ్లీ బుకింగ్ చేసుకోవచ్చు. ఏ జిల్లా రైతులు అదే జిల్లాలోనే యూరియా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. పక్క జిల్లాలో బుకింగ్ చేసుకునే అవకాశం ఉండదు.