News June 24, 2024
NDA అంటే అర్థమిదే: KTR

TG: NDA అంటే జాతీయ వినాశన కూటమి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR దుయ్యబట్టారు. ఈ నెలలో విద్యార్థుల కెరీర్ను నాశనం చేసే వరుస ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని ట్వీట్ చేశారు. నీట్-యూజీ పేపర్ లీక్, UGC NET రద్దు, CSIR యూజీసీ నెట్, నీట్ PGTలను వాయిదా వేశారన్నారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలకు అర్థంపర్థం లేదని దుయ్యబట్టారు. కేంద్రం అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు.
Similar News
News January 14, 2026
నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ పబ్లిక్ టాక్

జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ మూవీ యూఎస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి. స్టోరీ లైన్ పాతదే అయినా కామెడీతో నవీన్ వన్ మ్యాన్ షో చేశారని ఆడియన్స్ తెలిపారు. పాటలను గ్రాండ్గా చిత్రీకరించారని, నిర్మాణ విలువలు బాగున్నాయన్నారు. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించాయని చెప్పారు. కాసేపట్లో Way2Newsలో మూవీ రివ్యూ & రేటింగ్.
News January 14, 2026
NEET PG.. నెగటివ్ మార్కులు వచ్చినా అడ్మిషన్!

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న PG మెడికల్ సీట్లను భర్తీ చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత పర్సంటైల్ను భారీగా తగ్గించడంతో రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు మైనస్ 40 మార్కులు సాధించినా అడ్మిషన్ పొందే అవకాశం దక్కింది. జనరల్, EWS అభ్యర్థులకు 7 పర్సంటైల్, PwBD 5 పర్సంటైల్, SC/ST/OBCలకు జీరో పర్సంటైల్గా కటాఫ్ నిర్ణయించారు. ఈ నిర్ణయం వైద్య విద్య ప్రమాణాలను దిగజార్చుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
News January 14, 2026
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి

AP: వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామకంపై నాలుగేళ్లుగా నెలకొన్న వివాదం కొలిక్కి వచ్చింది. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంతరాయ మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠం 12వ పీఠాధిపతిగా ఏపీ ధార్మిక పరిషత్ నిర్ణయించింది. పీఠం ఎవరు అధిష్ఠించాలనే విషయంలో వసంతరాయ మొదటి భార్య, రెండో భార్య కుమారుల మధ్య నాలుగేళ్లుగా వివాదం నడిచింది.


