News October 25, 2024
జగన్ ఆస్తులతో షర్మిలకు సంబంధమేంటి?: వైసీపీ

AP: సీఎం చంద్రబాబు డైరెక్షన్లో విజయమ్మను ముందుపెట్టి జగన్ను న్యాయపరంగా ఇబ్బంది పెట్టాలని షర్మిల కుట్ర చేస్తోందని వైసీపీ ఆరోపించింది. ‘కుటుంబ ఆస్తులన్నింటినీ YSR జీవించి ఉన్నప్పుడే పంపకాలు చేసేశారు. కానీ చెల్లి షర్మిలపై ఉన్న ప్రేమాభిమానాలతో జగన్ తాను సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల్లోనూ వాటా ఇచ్చేందుకు ముందుకొచ్చారు’ అని ట్వీట్ చేసింది. ‘శాడిస్ట్ చంద్రబాబు’ అని పేర్కొంది.
Similar News
News November 21, 2025
ఈనెల 24 నుంచి మీకోసం రైతన్న కార్యక్రమాలు: కలెక్టర్

నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈనెల 24 నుంచి మీకోసం రైతన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మీకోసం రైతన్న కార్యక్రమాన్ని ప్రతి మండలంలో నిర్వహిస్తూ రైతు అభ్యున్నతికి సూచనలు సలహాలు చేస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
News November 21, 2025
రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు!

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ దక్కుతుందనే చర్చ మళ్లీ మొదలైంది. గతంలో ఉన్న రిజర్వేషన్లు మారనున్నాయి. జనాభా ప్రాతిపదికన వీటిని ఖరారు చేయనున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పుడున్న కేటగిరీకి కాకుండా మరో కేటగిరీకి ఛాన్స్ రానుంది. దీనిపై రేపు వెలువడే జీవోతో క్లారిటీ రానుంది. రాష్ట్రంలో 12,760గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి.