News July 15, 2024

పార్టీ మార్పు ప్రచారంపై BRS ఎమ్మెల్యే ఏమన్నారంటే?

image

TG: కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఖండించారు. తాను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ ముందు తానే వేశానని గుర్తు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కచ్చితంగా అనర్హత వేటు పడుతుందన్నారు. తన నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు.

Similar News

News September 18, 2025

మైథాలజీ క్విజ్ – 9 సమాధానాలు

image

1. రాముడికి ‘గంగానది’ ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు.
2. దుర్యోధనుడి భార్య ‘భానుమతి’.
3. ప్రహ్లాదుడు ‘హిరణ్యకశిపుడు’ అనే రాక్షస రాజు కుమారుడు.
4. శివుడి వాహనం పేరు నంది.
5. మొత్తం జ్యోతిర్లింగాలు 12. అవి మల్లికార్జునం, సోమనాథేశ్వరం, మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం, కేదారనాథేశ్వరం, భీమశంకరం, నాగేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాథేశ్వరం, కాశీ విశ్వేశ్వరం, త్రయంబకేశ్వరం, రామేశ్వరం.<<-se>>#mythologyquiz<<>>

News September 18, 2025

ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ

image

ఆస్ట్రేలియా-Aతో లక్నోలో జరుగుతున్న తొలి అనధికార టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో IND-A ప్లేయర్ ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ(113*) సాధించారు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. పడిక్కల్(86*), సాయి సుదర్శన్(73), జగదీశన్(64) అర్ధశతకాలతో రాణించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 403 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన AUS-A 532/6కు డిక్లేర్ చేసింది.

News September 18, 2025

జీఎస్టీ సంస్కరణలపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

image

AP: జీఎస్టీ సంస్కరణలపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పన్నుల విధానంతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. పన్నుల విధానంలో 2 శ్లాబులు (5%,18%) మాత్రమే ఉంచి సరళతరం చేశారని పేర్కొన్నారు.