News October 13, 2025
మిథున రాశి చిహ్నానికి అర్థమేంటి?

రాశీచక్రంలో మూడోదైన మిథున రాశి చిహ్నానికి అర్థమేంటో కొందరికి తెలియదు. దీని గురించి పండితులు ఇలా చెబుతున్నారు.. ఈ చిహ్నం జంట రూపంలో ఉంటుంది. దీని మూలకం వాయువు. ఇది సంభాషణ, జ్ఞాన సముపార్జనను సూచిస్తుంది. ఈ రాశివారు మేధోపరమైన జిజ్ఞాసకు నిలయంగా ఉంటారు. ఈ చిహ్నం ఆత్మలోని ద్వంద్వ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. నిత్య నూతన ఆలోచనలను అన్వేషించడానికి ప్రేరేపిస్తుంది. వీళ్లు భావవ్యక్తీకరణలో ముందుంటారు.
Similar News
News October 13, 2025
ఏ దిక్కున ఏం ఉండాలంటే?

ఇంట్లో అందరూ సుఖశాంతులతో ఉండాలంటే తూర్పు, ఉత్తరం దిక్కులు లోతుగా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఈశాన్యంలో నీటి గుంట (సంపు, బావి) ఉండాలంటున్నారు. ‘పడమర, దక్షిణం దిక్కులు ఎత్తుగా ఉండాలి. నైరుతిలో ధాన్యపు గాదెలు, ట్యాంకులు, ఎక్కువ బరువుండే నిర్మాణాలు ఉండాలి. వంటగది ఆగ్నేయంలో, బాత్‌రూమ్ వాయువ్యంలో ఉండాలి. ఈ ఆరు అమరికలు ఇంటికి బలాన్ని ఇస్తాయి’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News October 13, 2025
గాజాలో మొదలైన బందీల విడుదల

గాజాలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల విడుదల మొదలైంది. తొలుత ఏడుగురిని రెడ్ క్రాస్‌కు హమాస్ అప్పగించింది. త్వరలో మరికొందరిని రిలీజ్ చేయనుంది. మరోవైపు తమ వారికి స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో ఎదురుచూస్తున్నారు. పీస్ డీల్ కుదర్చడంలో కీలకంగా వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు చెబుతూ నగరంలో భారీగా సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు.
News October 13, 2025
తాజా వార్తలు

* జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 11న పోలింగ్, 14న ఎన్నికల ఫలితాలు
* అమరావతిలోని రాయపూడిలో CRDA ఆఫీస్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
* మాజీ ఎమ్మెల్యే కొండారెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
* IND vs WI: ఫాలో ఆన్‌లో సెంచరీ చేసి ఔటైన ఓపెనర్ క్యాంప్‌బెల్(115).. ప్రస్తుతం WI స్కోర్ 247/3.