News December 12, 2024

ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెబుతోంది?

image

కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో <<14859693>>ఈ చట్టాన్ని<<>> ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 1947, AUG 15 నాటికి ఉన్న మతపరమైన స్థలాలను మరో మతానికి చెందిన స్థలాలుగా మార్చడానికి అధికారం ఉండదు. ఒకవేళ ఇలాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా ఉంటుంది. అయోధ్య రామ మందిరాన్ని ఈ చట్టం నుంచి మినహాయించారు. చట్టం తీసుకొచ్చే నాటికి కోర్టులో దీనిపై వ్యాజ్యం నడుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

Similar News

News December 13, 2024

ఈ జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో రేపు తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు సెలవు తప్పనిసరిగా ఇవ్వాలని కలెక్టర్లు స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News December 12, 2024

రైతుకు బేడీలు.. విచారణలో ఏం తేలిందంటే?

image

TG: రైతుకు <<14858119>>బేడీలు వేసిన ఘటన<<>> వెనుక కుట్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఐజీ సత్యనారాయణ విచారణ చేపట్టారు. దీనికి సంగారెడ్డి జైలు సిబ్బంది తప్పిదమే కారణమని తేల్చారు. జైలు అధికారులు VKB పోలీసులకు బదులుగా సైబరాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారని, హీర్యా నాయక్ లగచర్లలో అరెస్టయితే బాలానగర్ కేసులో అరెస్టయినట్లు జైలు రికార్డుల్లో ఉందని గుర్తించారు. సంగారెడ్డి జైలర్ సంతోష్ కుమార్ రాయ్‌‌ను సస్పెండ్ చేశారు.

News December 12, 2024

రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా?

image

APలో రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడటంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. అయితే శుక్రవారం విద్యాసంస్థలకు సెలవుపై కలెక్టర్లు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇవాళ ఆలస్యంగా సెలవు ప్రకటించడంతో అప్పటికే ఆ 2 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.