News April 22, 2025

పోప్ డెత్ రిపోర్ట్‌లో ఏముందంటే?

image

పోప్ ఫ్రాన్సిస్ నిన్న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. గుండెపోటుతోనే ఆయన మృతిచెందినట్లు వాటికన్ డాక్టర్ ఆండ్రియా విడుదల చేసిన డెత్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. చనిపోయేముందు ఆయన కోమాలోకి వెళ్లినట్లు తెలిపారు. కాగా శుక్రవారం లేదా ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం. ఎలాంటి ఆడంబరం లేకుండా మట్టిలో పూడ్చాలని, ఇన్‌స్క్రిప్షన్‌పై తన పేరును లాటిన్ భాషలో రాయాలని ఆయన ముందుగానే చెప్పినట్లు తెలుస్తోంది.

Similar News

News January 15, 2026

ఫోన్ ఎత్తుకెళ్లిన బెంగాల్ సీఎం.. సుప్రీంకోర్టులో ఈడీ

image

వెస్ట్ బెంగాల్ ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలపై సుప్రీంకోర్టులో వాడీవేడీగా విచారణ జరిగింది. సోదాల సమయంలో WB సీఎం మమతా తమ ఫోన్‌ను ఎత్తుకెళ్లినట్లు ఈడీ అధికారులు SCకి తెలియజేశారు. మనీలాండరింగ్ విషయమై సోదాల గురించి ముందే స్థానిక PSకు సమాచారమిచ్చినా పోలీసులతో మమతా తమ సోదాలకు అంతరాయం కలిగించారన్నారు. అటు పోలీసులను మమత నియంత్రించడం తీవ్రమైన అంశంగా సుప్రీంకోర్టు పరిగణించింది.

News January 15, 2026

పొద్దుతిరుగుడు నాటిన తర్వాత కలుపు నివారణ

image

పొద్దుతిరుగుడు విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు 200 లీటర్ల నీటిలో 1 లీటర్ పెండిమిథాలిన్30% E.C రసాయనాన్ని కలిపి పిచికారీ చేయాలి. దీని వల్ల 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పంట 30-40 రోజుల దశలో అంతరకృషి చేయాలి. ఇది సాధ్యం కాకపోతే గడ్డి జాతి కలుపు నివారణకు ఎకరాకు 400ml క్విజాలొఫాప్ ఇథైల్ 5% ఇ.సి. లేదా ప్రొపాక్విజాఫాప్ 10% ఇ.సి. 250mlను 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు 2-4 ఆకుల దశలో పిచికారీ చేయాలి.

News January 15, 2026

ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు… అప్లై చేశారా?

image

<>ఇర్కాన్ <<>>ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ 32 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.. బీటెక్, బీఈ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 19 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు . నెలకు జీతం రూ.60 వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ircon.org